సౌమ్య ప్రాణం తీసిన అక్రమ సంబంధం

హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన సౌమ్య హత్యకేసు మిస్టరీ వీడింది. అయితే సౌమ్య మరణం తో కేసు నమోదు...
హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన సౌమ్య హత్యకేసు మిస్టరీ వీడింది. అయితే సౌమ్య మరణం తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గొంతుకోసి ఉండడం, గ్యాస్ లీక్ చేసి ఉండడంతో సౌమ్యది హత్య అని పోలీసులు నిర్ధారించారు. మరి హత్య ఎవరు చేశారు అనే కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులు మరికొన్ని షాకింగ్ విషయాల్ని వెలుగులోకి తెచ్చారు.
అనంతపురం బత్తలపల్లి మండలం మాల్యావంతం గ్రామానికి చెందిన ప్రకాశ్, నాగభూషణంలు నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి, అసోంలలో కలిసి పని చేశారు. ఆ తర్వాత ఇద్దరికి వేర్వేరు చోట్ల ఉద్యోగాలు వచ్చాయి. నాగభూషణానికి వివాహమైంది. ప్రకాశ్ వేరే ప్రాంతంలో ఉద్యోగం చేసుకునేవాడు. అప్పడప్పుడు తన స్నేహితుడు నాగభూషణం ఇంటికి వచ్చేవాడు ప్రకాష్ . ఆ క్రమంలో నాగభూషణం భార్య సౌమ్యతో ప్రకాష్ పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం కాస్తా శారీరక సంబంధానికి దారి తీసింది. అయితే నాగభూషణం ఇంటికి పలుమార్లు వచ్చిన ప్రకాష్ సౌమ్యతో అక్రమసంబంధాన్ని కొనసాగించేవాడు. అవసరం ఉన్నప్పుడు సౌమ్యదగ్గర డబ్బులు తీసుకునేవాడు. ఓ క్రమంలో ప్రకాష్ ప్రవర్తన కారణం గా ఉద్యోగాన్ని కోల్పోయాడు. జల్సాలు, తిరుగుళ్లకు అలవాటు పడ్డాడు. ఉద్యోగం కోల్పోవడంతో స్కార్పియోను ను కొనుగోలు చేశాడు. ఆ వాహనానికి సంబంధించి పెద్దమొత్తంలో చెల్లించాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో ఎప్పటిలాగే నాగభూషణం ఇంటికి వచ్చాడు ప్రకాష్. అదే రోజు సాయంత్రం నాగభూషణం ఇంట్లో ప్రకాష్ , నాగభూషణం, అతని భార్య సౌమ్యలు కలిసి మధ్యం సేవించారు. నాగభూషణం విధులకు వెళ్లాల్సి ఉండగా ప్రకాష్ ను ఇంట్లోనే ఉంచి వెళ్లాడు . నాగభూషణం వెళ్లిన తరువాత ప్రకాష్ సౌమ్యను డబ్బులు కావాలని వేధించాడు. డబ్బులు లేవని సౌమ్య చెప్పడంతో ఆగ్రహం తో ఊగిపోయిన ప్రకాష్ తమమధ్య ఉన్న అక్రమసంబంధం గురించి నాగభూషణం కు చెప్పేస్తానని బెదిరించాడు. అయితే సౌమ్య డబ్బులు ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. దీంతో విచక్షణ కోల్పోయిన ప్రకాష్ సౌమ్యను డంబుల్ రాడ్డుతో తల, ఎడమకన్ను పైభాగంలో కొట్టాడు. బాత్రూంలోకి వెళ్లి రేజర్ బ్లేడ్ తీసుకు వచ్చి గొంతు కోశాడు. చంపి, ఆ తర్వాత పూజగదిలోని నూనెను తీసుకు వచ్చి సౌమ్య పైన పోశాడు. ఆమెకు నిప్పు పెట్టాడు. అప్పుడు సౌమ్య కొడుకు సాయిదత్తాత్రేయ ఇంట్లోనే మరో గదిలో నిద్రపోతున్నాడు. సౌమ్య ఫోన్‌ను బాత్రూంలో ఫ్లష్ ట్యాంకులో పడేసి, ఆధారాలు లేకుండా చేశాడు. సిలిండర్ గ్యాస్ వదిలాడు. సౌమ్య వంటిపై 3 తులాల బంగారు ఆభరణాలను తీసుకొని వెళ్లిపోయాడు. వెళ్లేటప్పుడు బయట గడియ పెట్టాడు. పొగలు వస్తుండటంతో స్థానికులు కొడుకు సాయిదత్తాత్రేయను కాపాడారు. సిలిండర్ నుంచి గ్యాస్ రావడం చూసి ఆపివేశారు. నాలుగు రోజుల్లో కేసు ఛేదన పోలీసులు ఈ కేసును నాలుగు రోజుల్లోనే ఛేదించారు. నిందితుడు అనంతపురంలో ఉన్నాడని గుర్తించి వారు అక్కడకు వెళ్లడంతో పోలీసులను చూసి ప్రకాశ్ పారిపోయే ప్రయత్నం చేశారు. పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. ఆ తర్వాత అతను కూడా నేరాన్ని అంగీకరించాడు.
Jayasudha: బీజేపీలోకి సినీనటి జయసుధ...?
9 Aug 2022 8:03 AM GMTటీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై కేసు నమోదు
9 Aug 2022 7:50 AM GMTTelangana News: వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియపై హైకోర్టు స్టే
8 Aug 2022 9:38 AM GMTBreaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMT
Rashmika Mandanna: కష్టానికి అదృష్టం తోడైంది...
9 Aug 2022 10:39 AM GMTగోరంట్ల మాధవ్ విషయంలో అతిగా స్పందించొద్దు.. వంగలపూడి అనితకు బెదిరింపు...
9 Aug 2022 10:22 AM GMTTelangana News: కన్నుల పండువగా.. ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ
9 Aug 2022 10:13 AM GMTBigg Boss 6 Telugu: అప్పగింతల కాన్సెప్ట్‌తో 'బిగ్‌బాస్' ప్రోమో.....
9 Aug 2022 10:00 AM GMTCash Deposit: ఈ 2 పత్రాలు లేకుండా మనీ డిపాజిట్ కష్టమే.. ఎందుకంటే..?
9 Aug 2022 9:15 AM GMT