ఘోర ప్రమాదం.. ఎనిమిదిమంది అక్కడికక్కడే మృతి

nanireddy
Updated on: 24 Dec 2018 3:15 PM IST
ఘోర ప్రమాదం.. ఎనిమిదిమంది అక్కడికక్కడే మృతి
X

తమిళనాడులోని తిరుచురాపల్లి రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన స్కార్పియో వాహనం అదుపు తప్పి అగివున్నలారీని ఢికొట్టడంతో ఊహించని భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులను చికిత్ప కోసం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణం అతివేగమని.. కంట్రోల్ తప్పడం వలెనే పెను ప్రమాదం జరిగివుంటుందని పోలీసులు భావిస్తున్నారు.

nanireddy

nanireddy

Next Story