సూపర్ సిరీస్ లో పీవీ సింధు ఓటమి

lakshman
Updated on: 24 Dec 2018 12:23 PM IST
సూపర్ సిరీస్ లో పీవీ సింధు ఓటమి
X

తెలుగుతేజం పీవీ సింధు తన కెరియర్ లో అతిపెద్ద సూపర్ సిరీస్ టైటిల్ సాధించే అవకాశాన్ని చేజార్చుకొంది. దుబాయ్ లో ముగిసిన 2017 సూపర్ సిరీస్ ఫైనల్స్...ఫైనల్ టోర్నీ టైటిల్ సమరంలో టాప్ సీడ్ అకానే యమగుచి తో సింధు పోరాడి ఓడింది. నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఈ సమరంలో...టాప్ సీడ్ యమగుచి...15-21, 21-12, 21-19తో విజేతగా నిలిచింది. తొలిగేమ్ ను 21-15తో నెగ్గిన సింధు...రెండోగేమ్ లో సైతం అదేజోరు కొనసాగించలేకపోయింది. సెమీఫైనల్లో చైనా ప్లేయర్ చెన్ యూఫేను అధిగమించిన సింధు ఫైనల్ టైటిల్ సమరం ప్రారంభానికి ముందే...హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది. తొలిగేమ్ నుంచే సింధు ఆత్మవిశ్వాసంతో ఆడుతూ యమగుచిని ఆత్మరక్షణలో పడేసింది. అయితే...రెండో గేమ్ ను 12-21తో చేజార్చుకొన్న సింధు....ఆఖరి గేమ్ లో సైతం తుదివరకూ పోరాడినా సఫలం కాలేకపోయింది. చివరకు రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గతంలో సైనా నెహ్వాల్ మహిళల సింగిల్స్ , గుత్తా జ్వాలా జోడీ డబుల్స్ ఫైనల్స్... ఫైనల్ చేరినా టైటిల్ సాధించలేకపోయారు. చివరకు సింధు సైతం ఫైనల్స్ టైటిల్ సమరానికి అర్హత సాధించినా....రన్నరప్ గానే మిగలాల్సి వచ్చింది.


lakshman

lakshman

Next Story