శ్రీదేవి మృతి కేసును క్లోజ్ చేసిన దుబాయ్ పోలీసులు

శ్రీదేవి మృతి కేసును క్లోజ్ చేసిన దుబాయ్ పోలీసులు
x
Highlights

శ్రీదేవి మృతి కేసులో విచారణ ముగిసిందని.. ఈ కేసును మూసివేస్తున్నట్లు దుబాయ్‌ పోలీసులు వెల్లడించారు. ‘ఈ కేసులో విచారణ ముగిసిందని దుబాయ్‌ పబ్లిక్‌...

శ్రీదేవి మృతి కేసులో విచారణ ముగిసిందని.. ఈ కేసును మూసివేస్తున్నట్లు దుబాయ్‌ పోలీసులు వెల్లడించారు. ‘ఈ కేసులో విచారణ ముగిసిందని దుబాయ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ వెల్లడించింది. ఫోరెన్సిక్‌ నివేదిక ప్రకారం ఆమె సృహకోల్పోవడంతో బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తు మునిగి చనిపోయింది. ఇక ఈ కేసు ముగిసింది’ అని దుబాయ్‌ మీడియా సెంటర్‌ ట్వీట్‌ చేసింది. కేసు ఓ కొలిక్కి రావడంతో శ్రీదేవి భౌతికకాయాన్ని కుటుంబీకులకు అప్పగించేందుకు క్లియరెన్స్‌ లభించింది. దీన్ని బట్టి చూస్తే మొత్తానికి శ్రీదేవి భౌతికకాయం ఈరోజు రాత్రి ముంబయికి చేరుకోనున్నట్లు తెలుస్తోంది.

శనివారం రాత్రి శ్రీదేవి దుబాయ్‌లోని జుమైరా ఎమిరేట్స్‌ హోటల్‌లో మరణించిన సంగతి తెలిసిందే. ఆమె గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కానీ ఫోరెన్సిక్‌ నివేదికలో ఆమె ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి చనిపోయినట్లు వెల్లడైంది. దాంతో శ్రీదేవి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దాంతో విచారణ నిమిత్తం కేసును దుబాయ్‌ పోలీసులు పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కు అప్పగించారు. పూర్తి విచారణ అనంతరం భౌతికకాయాన్ని భారత్‌కు తరలించేందుకు క్లియరెన్స్‌ పత్రాలు జారీ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories