యువతి వీరంగం

యువతి వీరంగం
x
Highlights

హైద్రాబాద్ జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌ నిర్వహించారు. మద్యం మత్తులో ఓ యువతి హంగామా చేసింది. 20 నిమిషాలపాటు...

హైద్రాబాద్ జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌ నిర్వహించారు. మద్యం మత్తులో ఓ యువతి హంగామా చేసింది. 20 నిమిషాలపాటు కారు దిగకుండా పోలీసులను ఇబ్బంది పెట్టింది. బ్రీత్ ఎనలైజర్ పరీక్షకు సహకరించకుండా ఇబ్బంది పెట్టింది. తాగిన పర్సంటేజ్ ఎక్కువ ఉండటంతో పారిపోయే యత్నించింది. పారిపోతున్న మహిళను ట్రాఫిక్, సివిల్ పోలీసులు వెంబడించి పట్టుకుని కేసు నమోదు చేశారు. చివరకు పోలీసులు ఆ యువతిపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టులో హాజరుపరచనున్నారు. చివరికి ఆమె స్నేహితులు వేరే వాహనంలోకి ఎక్కించి తీసుకెళ్లారు. ఆమె మోతాదుకి మించి మద్యం సేవించినట్టు పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు జరిపిన తనిఖీల్లో మొత్తంగా 59 కేసులు పెట్టారు. 34 కార్లు, 25 బైకులు స్వాధీనం చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories