'పైసావ‌సూల్‌'తో బ్రేక్ ప‌డుతుందా?

పైసావ‌సూల్‌తో బ్రేక్ ప‌డుతుందా?
x
Highlights

మ‌హాన‌టుడు స్వ‌ర్గీయ ఎన్టీఆర్ సినిమా టైటిల్స్‌ని మ‌రోసారి త‌న సినిమాల‌కు వాడుకుని, అలాగే ఆ మ‌హాన‌టుడి సినిమాల‌ను రీమేక్ చేసి కూడా బాల‌య్య‌...

మ‌హాన‌టుడు స్వ‌ర్గీయ ఎన్టీఆర్ సినిమా టైటిల్స్‌ని మ‌రోసారి త‌న సినిమాల‌కు వాడుకుని, అలాగే ఆ మ‌హాన‌టుడి సినిమాల‌ను రీమేక్ చేసి కూడా బాల‌య్య‌ చెప్పుకోద‌గ్గ విజ‌యాలు అందుకున్న సంద‌ర్భాలున్నాయి. అయితే ఎటొచ్చి.. ఆయ‌న‌ పాట‌ల‌ను రీమిక్స్ చేసి విజ‌యం అందుకున్న సంద‌ర్భాలు మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు లేవు బాల‌య్య‌కి.

అప్పుడెప్పుడో 'జ‌స్టిస్ చౌద‌రి'లోని 'నే తొలి చూపులోనే' పాట‌ని 'నిప్పులాంటి మ‌నిషి' సినిమా కోసం రీమిక్స్ చేసుకున్న బాల‌య్య‌కి ఫ‌లితం విష‌యంలో నిరాశే ఎదురైంది. 'భ‌లే త‌మ్ముడు' లోని 'నేడే ఈ నాడే' పాట‌ని 'అల్ల‌రి పిడుగు' కోసం.. 'ఛాలెంజ్ రాముడు'లోని 'ప‌ట్టుకో ప‌ట్టుకో ప‌ట్టుచీర' పాట‌ని 'ఒక్క మ‌గాడు' కోసం రీమిక్స్ చేసిన‌ప్ప‌టికీ ఫ‌లితం డిటో డిటో.

ఇలాంటి నేప‌థ్యంలో ఎన్టీఆర్ 'జీవిత చ‌క్రం'లోని 'కొంటె న‌వ్వు చెబుతోంది' పాటని బాల‌య్య కొత్త చిత్రం 'పైసా వ‌సూల్' కోసం రీమిక్స్ చేశారు. ఈ సినిమా అయినా మంచి విజ‌యం సాధిస్తే.. రీమిక్స్ విష‌యంలో బాల‌య్య‌కి ఎదురైన చేదు అనుభ‌వాల‌కి ఫుల్‌స్టాప్‌ ప‌డుతుంది. 'పైసా వ‌సూల్' రేపు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories