క్షీణించిన కరుణానిధి ఆరోగ్యం..

nanireddy
Updated on: 24 Dec 2018 2:05 PM IST
క్షీణించిన కరుణానిధి ఆరోగ్యం..
X

రాజకీయ కురువృద్ధుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, కరుణానిధి మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవలే కోలుకున్నారు. ఇప్పటికే ఆయనకు వైద్యులు ట్రుస్టోక్టమీ అమర్చి, దానిద్వారానే ఆహారం అందిస్తున్నారు. ఈ క్రమంలో అయన మరోసారి అనారోగ్యానికి గురవ్వడంతో.. చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఆయన ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్‌ విడుదల చేశారు. జ్వరం, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్‌ కారణంగా ఇబ్బంది పడుతున్నారని ప్రకటించారు. తండ్రి అనారోగ్యం గురించి తెలిసిన వెంటనే ఇద్దరు కొడుకులు.. అళగిరి, స్టాలిన్ లు చెన్నై నగరానికి చేరుకున్నారు. మరోవైపు కరుణానిధి ఆరోగ్యం విషమించిందన్న వార్తలతో.. ఆయన వద్దకు రాజకీయ నేతలు క్యూ కట్టారు. తమిళనాడు మాజీ సీఎం, ప్రస్తుతం డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కరుణానిధిని పరామర్శిసితున్నారు.

nanireddy

nanireddy

Next Story