బీజేపీకి షాక్.. కీలకనేత రాజీనామా!

nanireddy
Updated on: 24 Dec 2018 1:45 PM IST
బీజేపీకి షాక్.. కీలకనేత రాజీనామా!
X

కర్ణాటకలో ఇటీవలే ఎన్నికల్లో గెలుపు అంచులవరకు వచ్చి పీఠం అందుకోలేక ఆగిపోయిన బీజేపీకి కీలకనేత రూపంలో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర బీసీ మోర్చా అధ్యక్షులు బీ.జే.పుట్టస్వామి. తన పదవికి రాజీనామా చేశారు. ఆయనకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చనందునే రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక ఎన్నికల సందర్బంగా పుట్టస్వామిని ఎమ్మెల్సీ ని చేసి కౌన్సిల్ లో బీజేపీపక్ష నాయకుడిగా చేస్తానని యడ్యూరప్ప హామీ ఇచ్చారు. దీంతో పుట్టస్వామి రాష్ట్రవ్యాప్తంగా కలియతిరిగి పార్టీకి కొంతమేర ఊపు తెచ్చారు. పలుచోట్ల బీసీ ల సభల ఏర్పాటులో ఆయన కీలకంగా వ్యవహరించారు. కానీ ఎన్నికలు ముగిసి నెలరోజులు దాటినా పదవి ఊసే లేకపోవడంతో పుట్టస్వామి అసంతృప్తికి లోనయ్యారు. ఈ క్రమంలో పార్టీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడికి పంపి నేరుగా బీసీ నేతలతో సమావేశమయ్యారు.

nanireddy

nanireddy

Next Story