లైంగిక వేధింపుల కేసులో డీఎస్ కుమారుడు సంజయ్ కి ఊరట

లైంగిక వేధింపుల కేసులో డీఎస్ కుమారుడు సంజయ్ కి ఊరట
x
Highlights

లైంగిక వేధింపుల కేసులో డిఎస్ కుమారుడు, నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్ కు ఊరట లభించింది. ఆయనకు గురువారం బెయిల్ మంజూర్ చేస్తూ జిల్లా కొర్టు ఉత్తర్వులు జారీ...

లైంగిక వేధింపుల కేసులో డిఎస్ కుమారుడు, నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్ కు ఊరట లభించింది. ఆయనకు గురువారం బెయిల్ మంజూర్ చేస్తూ జిల్లా కొర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 19 రోజుల పాటు జిల్లా జైలు లో ఉన్న సంజయ్ శుక్రవారం బెయిల్‌పై విడుదల అయ్యారు. కాగా నిజామాబాద్ లోని ఓ కళాశాలలో చదువుతున్న విద్యార్థినులను సంజయ్ లైంగిక వేధింపులకు గురిచేశారని కొంతమంది విద్యార్థులు ఆరోపించారు. దీంతో అతనిపై కేసు నమోదయింది. సంజయ్‌ని అరెస్ట్‌ చేసి పోలీసులు రిమాండ్‌ విధించడాన్ని సవాల్‌ చేస్తూ రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే సంజయ్ కు బెయిల్ మంజూరు చేసింది జిల్లా కొర్టు. ప్రతి గురువారం, శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో హాజరు కావాలని సంజయ్ కి ఆదేశించింది కోర్టు.

Show Full Article
Print Article
Next Story
More Stories