దీపికా పడుకొనే సక్సెస్ మంత్ర

దీపికా పడుకొనే సక్సెస్ మంత్ర
x
Highlights

ఒకప్పుడు డిప్రెషన్ ఇప్పుడు పర్ఫెక్షన్ అప్పుడు ఏం జరుగుతుందోనని భయపడింది ఇప్పుడు ఆ భయం దరిచేరకుండా ఏం చేయాలో చెప్తోంది బెదిరించినా భయపెట్టినా ధైర్యం...

ఒకప్పుడు డిప్రెషన్ ఇప్పుడు పర్ఫెక్షన్ అప్పుడు ఏం జరుగుతుందోనని భయపడింది ఇప్పుడు ఆ భయం దరిచేరకుండా ఏం చేయాలో చెప్తోంది బెదిరించినా భయపెట్టినా ధైర్యం ముందడుగేసింది. డిప్రెషన్‌ను డీల్ చేసి గెలిచేసింది. రియల్ లైఫ్‌లో సక్సెస్‌ను మళ్లీ అందుకుంది. ఆమె బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే వరల్డ్ ఐటీ కాంగ్రెస్ క్లోజింగ్ సెర్మనీలో మెరిసింది. మెంటల్ హెల్త్ ఆవశ్యకత, డిప్రెషన్ వల్ల ప్రజలు అనుభవిస్తున్న బాధల్ని వివరించే ప్రయత్నం చేసింది. డిప్రెషన్, మానసిక ఆనందంపై అడిగిన ప్రశ్నలకు పద్మావతి పద్ధతిగా సమాధానాలు చెప్పింది. సామాజిక చైతన్యంతోనే డిప్రెషన్‌కు పరిష్కారం దొరుకుతుందన్న దీపిక ప్రతి ఒక్కరూ తాను ఒంటరిననే భావనను వీడాలని చెప్పింది. తాను డిప్రెషన్‌లో కూరుకుపోయినప్పుడు తన అమ్మే తనకు అండగా నిలిచిందని తెలిపింది.

అసలు దీపిక ఎందుకు డిప్రెషన్‌కు గురైంది.? అప్పుడు ఆమె పడిన మానసిక సంఘర్షణ ఏంటి.? ఒకానొక టైంలో ఆత్మహత్య కూడా చేసుకునే పరిస్థితుల్లోకి వెళ్లి తిరిగి కొత్త లైఫ్ ఎలా స్టార్ట్ చేసింది.?

బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ స్టార్ హీరోయిన్‌గా టర్న్ తీసుకునే టైం కెరీర్ మాంఛి స్వింగ్‌లో ఉందనుకున్న టైంలో సీన్ రివర్సైంది. ఫ్లాపులు ఎక్కువయ్యాయి అవకాశాలు తగ్గిపోయాయి అప్పటిదాకా మార్మోగిపోయిన దీపిక పేరు మెల్లగా సైలెంటైపోతోంది. ఏం చేయాలో తోచడం లేదు ఎలా నెగ్గుకురావాలో అర్థం కావటం లేదు. సరిగ్గా అప్పుడే 2014లో దీపికా తీవ్ర డిప్రెషన్‌కు గురైంది. తన బాధను ఎవరితో చెప్పుకోవాలో తెలియడం లేదు. ఒకరకమైన అసహనం. అసంతృప్తి. ఏదో కోల్పోయానన్న బాధ. ఏమీ చేయలేకపోతున్నానన్న నిస్తేజం ఇలా అన్నీ ఒకేసారి దీపిక మైండ్‌లో ఫిక్స్ అయ్యి కూర్చున్నాయి.

చాలా రోజుల వరకు దీపిక బయటకి రాలేదు. ఈ రకమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు అమ్మే ఆమెకు అండగా నిలబడింది. నువ్వు ఒంటరి కాదు మేమున్నామని చెప్పింది. అంతా అయిపోయిందనుకున్న కూతురుకు అసలు లైఫ్ ఇప్పుడే మొదలైందని చెప్పింది. ఓటమి నుంచి ఎలా గెలవాలో నేర్పింది. అనుక్షణం ఆమె వెన్నంటే ఉంటూ ధైర్య నూరిపోసింది. మళ్లీ జీవితంపై ఆశలు చిగురించేలా చేసింది. అంతే కోల్పోయిన శక్తిని తిరిగి కూడగట్టుకుంది. రెట్టించిన ఉత్సాహంతో జీవితంలో ముందడుగు వేసింది. డిప్రెషన్‌ను జయించింది.

2015 జనవరిలో దీపిక తను డిప్రెషన్‌కు గురైన విషయాన్ని బయటపెట్టింది. అప్పుడు బాలీవుడ్ మాత్రమే కాదు దేశమంతా షాక్ అయ్యింది. తర్వాత డిప్రెషన్‌లో తాను చూసిన నరకాన్ని ఎవరూ అనుభవించకూడదని 2015 అక్టోబర్‌లో లీవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్ స్టార్ట్ చేసింది. దేశంలో మానసిక ఆరోగ్య సమస్యల పరిష్కారం, అవగాహన దిశగా లివ్ లవ్ లాఫ్ సంస్థ పని చేస్తుందని దీని ద్వారా ఒక్క లైఫ్ సేవ్ చేసినా చాలని దీపికా వరల్డ్ ఐటీ కాంగ్రెస్‌లో చెప్పింది.

డిప్రెషన్ అనేది ఒక దేశం మాత్రమే ఎదుర్కొంటున్న సమస్య కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్య. డిప్రెషన్ నుంచి బయటపడాలనుకునే ఆలోచనే మనల్ని సగం గెలిపిస్తుందని, ఈ విషయంలో తల్లిదండ్రుల సహకారం చాలా అవసరమని చెప్తోంది దీపిక. ఆమె స్టార్ హీరోయినే అయినా డిప్రెషన్ విషయంలో మాత్రం ఆమె మళ్లీ తన జీవితాన్ని తాను గెలుచుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories