కరుణానిధి సతీమణికి తీవ్ర అస్వస్థత.. అపోలోకు తరలింపు

nanireddy
Updated on: 24 Dec 2018 2:46 PM IST
కరుణానిధి సతీమణికి తీవ్ర అస్వస్థత.. అపోలోకు తరలింపు
X

దివంగత ముఖ్యమంత్రి, డీఎంకే మాజీ చీఫ్ కరుణానిధి సతీమణి దయాళు అమ్మాళ్ మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో ఆమె అస్వస్థతకు గురికావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి యాజమాన్యం హెల్త్ బులిటెన్ విడుదల చేయలేదు. దయాళు అమ్మాళ్ కరుణానిధికి రెండవ భార్య, ఆమెకు ఇద్దరు కుమారులు.. డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, ఎంకే అళగిరి, కుమార్తె ఎంకే సెల్వి ఉన్నారు. డీఎంకే అధ్యక్షుడిగా ఎంకే స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికైన రోజే ఆమె అస్వస్థతకు గురికావడంతో ఆ పార్టీ నేతల్లో టెన్షన్ నెలకొంది.

nanireddy

nanireddy

Next Story