logo

బాల్కనీలో వేలాడిన పసిప్రాణం..

బాల్కనీలో వేలాడిన పసిప్రాణం..

తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగా ఓ పాప ప్రాణాపాయంనుంచి తప్పించుకుంది. మూడంతస్థుల భవంతిలో ఇరుక్కుని అల్లాడిపోయింది. చైనాలో ఇటీవల ఈ ఘటన జరిగింది. ఓ బిల్డింగ్ లో నివాసముంటోంది చింగ్ ఉం.. కుటుంబం అతనికి రెండేళ్ల చిన్నారి ఉంది. ఆ చిన్నారి ఇంట్లో నిద్ర పోతున్న సమయం చూసి బయటికి వెళ్ళాడు. ఇంతలో ఆ చిన్నారి నిద్రలేచి.. తండ్రికోసం బాల్కనీలో తొంగి చూసింది. ఇంతలో ప్రమాదవశాత్తు కిందపడబోయి.. బాల్కానీకున్న ఫెన్సింగ్ లో తల ఇరుక్కుంది. అప్పుడే బిల్డింగ్ పరిసర ప్రాంతానికి చేరుకున్న కొరియర్ బాయ్ పాప పరిస్థితి చూసి. అత్యంత చాకచక్యంగా పాప ప్రాణాలు కాపాడాడు. ఆ తరువాత పాప తండ్రి వచ్చి జరిగిన విషయాన్నీ తెలుసుకుని పాపను హత్తుకున్నాడు. అనంతరం కొరియర్ బాయ్ కి కృతజ్ఞత తెలియజేశాడు.

nanireddy

nanireddy

Our Contributor help bring you the latest article around you


లైవ్ టీవి

Share it
Top