బీజేపీకి డేంజర్ బెల్స్

బీజేపీకి డేంజర్ బెల్స్
x
Highlights

దేశంలో మోడీ హవా తగ్గుతోందా..? బీజేపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయా..? వివిథ రాష్ట్రాల్లో వచ్చిన ఉపఎన్నికల ఫలితాలు ఏం చెబుతున్నాయి...? బీజేపీ కంచుకోట...

దేశంలో మోడీ హవా తగ్గుతోందా..? బీజేపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయా..? వివిథ రాష్ట్రాల్లో వచ్చిన ఉపఎన్నికల ఫలితాలు ఏం చెబుతున్నాయి...? బీజేపీ కంచుకోట గోరఖ్‌పూర్‌తో పాటు సిట్టింగ్ సీటు ఫూల్ పూర్‌లో బీజేపీ పరాజయం దేనికి సంకేతం. 2014లో లోక్‌సభలో 282గా ఉన్న బీజేపీ సీట్లు... నాలుగేళ్ళల్లో 272కి తగ్గడం దేనికి సూచిక..?

2014లో బీజేపీది తిరుగులేని విజయం.. ప్రస్తుతం ‌లోక్‌సభలో మాత్రం అత్తెసరు మెజారిటీనే..! అవును నాలుగేళ్ళల్లో సీన్ చాలా మారిపోయింది. 2014 సాధారణ ఎన్నికల్లో ఎన్డీఏకి వచ్చిన సీట్లు 3 వందలకు పైనే. ఇందులో ఒక్క బీజేపీకే 282 సీట్లు వచ్చాయి. కూటమితో సంబంధం లేకుండా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగినంత మెజారిటీ తెచ్చుకుంది. పైగా కాంగ్రెస్ ముక్త భారత్ పిలుపుతో మిత్రులతో కలసి 21కి పైగా రాష్ట్రాల్లో పాగా వేయగా కేవలం బీజేపీనే 16 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. కానీ సాథారణ ఎన్నికలకు ఏడాది ముందు కమలదళం గుండెల్లో డేంజర్ సైరన్ మొదలైంది.

2014 తర్వాత బీజేపీ బలం అంతకంతకూ తగ్గుతూ వస్తోంది. వివిధ కారణాల వల్ల జరిగిన ఉప ఎన్నికల్లో ఓడిపోవడమే ఇందుకు ప్రధాన కారణం. 2014 నుంచి ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ 10 సిట్టింగ్ స్థానాలను కోల్పోయింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో రెండు సీట్లు కోల్పోవడంతో బీజేపీ బలం 272కు పడిపోయింది. ఇది సరిగ్గా సింపుల్‌ మెజారిటీ. ఎన్డీఏ మిత్ర పక్షాలతో సంబంధం లేకుండా ఉంటే బీజేపీకి ఒక్క సీటు తగ్గినా సాంకేతికంగా ప్రభుత్వం మైనారిటీలో ఉన్నట్లే లెక్క. దేశవ్యాప్తంగా మరో ఏడు సీట్లకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. అవి కూడా పూర్తయితే 2019లో బీజేపీ భవిష్యత్ ఏంటో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories