కోనసీమ కొంప ముంచుతున్న తుపాన్లు

కోనసీమ కొంప ముంచుతున్న తుపాన్లు
x
Highlights

పెథాయ్ తుపాన్ కోనసీమను కుదిపేస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం పెనుతుపానుగా మారడంతో సముద్రతీర ప్రాంతాల్లో అలజడి ఉధృతమయ్యింది....

పెథాయ్ తుపాన్ కోనసీమను కుదిపేస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం పెనుతుపానుగా మారడంతో సముద్రతీర ప్రాంతాల్లో అలజడి ఉధృతమయ్యింది. అధికారయంత్రంగా ముందస్తు చర్యలు చేపట్టినప్పటికీ లంకగ్రామాల ప్రజలు భయాందోళనతో కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ఈసారి ఎలాంటి ముప్పు ఎదురువతుందనని గజగజ వణుకుతున్నారు

పెథాయ్ తుపాను పడగ విప్పుకోవడంతో ఉభయగోదావరి జిల్లాలు అప్రమత్తం అయ్యాయి. సముద్ర తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. క్షణ క్షణం.. భయం భయంతో బిక్కిబిక్కుమంటూ గడుపుతున్నారు తీరప్రాంత వాసులు. కాకినాడ తీరంలో నివాసం ఉంటున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. తుపాను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపట్టారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఆధునిక టెక్నాలజితో సహాయక చర్యలు చేపడుతున్నారు.

ఉప్పాడ తీరంలో బలమైన ఈదులు గాలులు వీస్తున్నాయి. తీరంలో సముద్ర కెరటాలు సాధారణ స్థాయి నుంచి నాలుగు మీటర్ల ఎత్తున ెగసి పడుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు, ఆచంట, పోడూరు, పాలకొల్లు, కాళ్ళ మండలాల తాజా పరిస్థితులపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. కాకినాడ సమీపంలో ఉన్న యానాం ప్రాంతానికి అధికారులు ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేశారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తుని ఎమ్మార్వో కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తుపాను తీవ్రతను బట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచనలు జారీ చేశారు. విద్యుత్, సమాచార సంబంధాలు, పూరిళ్లు రోడ్లు దెబ్బతినే అవకాశాలుంటాయని పంటలకు తీవ్ర నష్టం వాటిల్లవచ్చని అంచనా వేస్తున్నారు. పంటలు నష్టపోతాయన్న ఆందోళనతో రైతులు..వలలు కాపాడుకునే యత్నంలో మత్స్యకారులు ఉన్నారు. తుపాను ప్రభావం ఏ విధంగా ఉంటుందో అన్న టెన్షన్ నెలకొన్నది.

Show Full Article
Print Article
Next Story
More Stories