తెలంగాణలో మలుపులు తిరుగుతున్న రాజకీయాలు...మరో కూటమి ఏర్పాటుకు కేసీఆర్ వ్యూహం

తెలంగాణలో మలుపులు తిరుగుతున్న రాజకీయాలు...మరో కూటమి ఏర్పాటుకు కేసీఆర్ వ్యూహం
x
Highlights

రాబోయే సాధారణ ఎన్నికల్లో గెలిచి తీరాలని కసితో ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌ అధికార టీఆర్ఎస్‌ను ఢీ కొట్టేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు...

రాబోయే సాధారణ ఎన్నికల్లో గెలిచి తీరాలని కసితో ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌ అధికార టీఆర్ఎస్‌ను ఢీ కొట్టేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా టీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలన్నిటిని కలుపుకొని రాష్ట్రస్థాయిలో ఫ్రంట్‌ ఏర్పాటు చేసే దిశగా పావులు కదుపుతోంది. ఇందుకోసం మొదటి నుంచి కాంగ్రెస్‌ను వ్యతిరేకించే టీడీపీతో పొత్తు పెట్టుకొనేందుకు సిద్ధమైంది. టీడీపీతో చేతులు కలిపితే తప్పేంటని తాజాగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మనసులో మాట బయటపెట్టారు.

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. నిన్నటి వరకు ఎన్నికల పోరు అధికార టీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీల మధ్యేనని అందరూ అంచనాలు వేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు గుండుగుత్తగా తమకే పడుతుందని హస్తం పార్టీ నేతలు లెక్కలు కట్టుకున్నారు.

కానీ కొత్త పార్టీలు రాక ప్రతి పార్టీ ఒంటరి పోరాటం చేస్తామని చెబుతుండటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే ప్రమాదం ఏర్పడింది. ముఖ్యంగా తెలంగాణ JAC తెలంగాణ జన సమితి పార్టీ ఏర్పాటు చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టడంతో గాంధీభవన్‌కు లెక్కలు తారుమారయ్యే భయం పట్టుకుంది.

దీంతో కాంగ్రెస్ పార్టీ కూటమి ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, సీపీఐ, తెలంగాణ జనసమితి, ఎమ్మార్పీఎస్‌లతో కలిసి టీఆర్ఎస్‌ను ధీటుగా ఎదుర్కోవాలని యోచిస్తున్నట్టు తెలిసింది. పీసీసీ చీఫ్ కూడా ఇదే విషయాన్ని సూచనప్రాయంగా చెప్పారు.

మహా కూటమి తరహాలో విపక్షాలన్నిటిని ఒక్క తాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుండటంతో అధికార టీఆర్ఎస్ కూడా కూటమి ఏర్పాటు ప్రయత్నాలు ప్రారంభినట్టు సమాచారం. బహుజన లెఫ్ట్ ఫ్రంట్‌తో వారిని దెబ్బకొట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహం పన్నుతున్నట్లు చర్చ జరుగుతోంది. ఇటీవల సీపీఎం నేత బీవీ రాఘవులు, కేసీఆర్ భేటీకి కారణం ఇదేనంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories