ప్రజలంతా టీఆర్ఎస్ వైపే...అందుకే మేము కూడా: కాంగ్రెస్ ఎమ్మెల్సీలు

arun
By arun
Updated on: 1 Sept 2020 4:38 PM IST
ప్రజలంతా టీఆర్ఎస్ వైపే...అందుకే మేము కూడా: కాంగ్రెస్ ఎమ్మెల్సీలు
X

కాంగ్రెస్ పార్టీ తరఫున తాము ఎన్నికైనప్పటికీ.. ప్రజలంతా కేసీఆర్ వైపే ఉన్నందున తమను కూడా టీఆర్ఎస్ శాసనమండలి పక్షంలో విలీనం చేయాలని కోరామని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు స్పష్టంచేశారు. ప్రజలందరూ టీఆర్ఎస్ వైపు ఉన్నారని ఎమ్మెల్సీ ఆకుల లలిత అన్నారు. తాము కూడా ప్రజల వైపు ఉండాలనుకుంటున్నామని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల వల్ల కాంగ్రెస్‌ పార్టీ నష్టపోయిందని వ్యాఖ్యానించారు.

arun

arun

Next Story