గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ కొంపముంచినవేంటి?

కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టిన వేళ. గుజరాత్ రూపంలో ఒక ఛాలెంజ్. కొత్త రాహుల్...
కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టిన వేళ. గుజరాత్ రూపంలో ఒక ఛాలెంజ్. కొత్త రాహుల్ నిజంగానే, తుది వరకూ పోరాడాడు. బీజేపీతో టగ్ ఆఫ్ వార్ అన్నట్టుగా ఓట్లశాతమూ సాధించాడు. మరెందుకు ఓడిపోయాడు ఏవి కాంగ్రెస్‌కు మైనయ్యాయి ఖద్దరు పార్టీ కొంముంచినవేంటి?
రాహల్ గాంధీ క్యాంపెనైతే, మోదీ కోటను బద్దలుకొట్టేస్తాడన్నట్టుగా సాగింది. నోట్ల రద్దు, జీఎస్టీ ఇబ్బందులు తమకు కలివస్తాయని రాహుల్ లెక్కలేశారు. దళితులు, మైనార్టీలు, హార్ధిక్ పటేల్, జిగ్నేష్, అల్పేష్‌లు తమ వెంటే ఉన్నారని సమీకరణలు చేశారు. అభివృద్దిడొల్లతనం, సీఎంగా మోదీ లేకపోవడం కలిసొస్తుందని అంచనా వేశారు. అన్నింటికీ మించి, రాహుల్ ప్రసంగాలు, ఆయన సభలకు వస్తున్న జనాలను చూసి, కాంగ్రెస్ అయితే, గెలిచినంత గంతులేసింది. కానీ ఎగ్జిట్‌పోల్స్ మాత్రం ఖద్దరు పార్టీని నిరాశపరిచాయి. ఎందుకు?
గుజరాత్ పోరు జాతీయ ఎన్నికల రణక్షేత్రంగా కనిపించింది. అంతకుమించి, రాహులా, మోదీనా అన్నట్టుగా సాగింది. కానీ ఇద్దరిలో ఎవరు కావాలంటే మాత్రం, తమవాడైన మోదీవైపే గుజరాతీలు నిలిచారని అర్థమవుతోంది. అంటే స్థానికత జనాలను ఆలోచింపజేసింది.
హార్థిక్ పటేల్. గుజరాత్‌లో అత్యంత ప్రాబల్యవర్గమైన పటేళ్లు తమవైపు ఉన్నారని, హార్థిక్‌ను చూసి మురిసిపోయింది కాంగ్రెస్. కానీ సొంతవర్గం హార్థిక్‌ను నమ్మలేదని అర్థమవుతోంది. సెక్స్ సీడీల బాగోతం కూడా మైనస్ అయ్యిందనుకోవాలి. రిజర్వేషన్లపై కాంగ్రెస్ గట్టి హామీ ఇవ్వకపోవడం కూడా హార్థిక్ పాత్రపై అనుమానాలు రేకెత్తించాయి. హార్థిక్ నమ్మినబంట్లు కూడా అనేక ఆరోపణలు చేసి, కాషాయ తీర్థంపుచ్చుకున్నారు. ఎగ్జిట్‌పోల్స్‌ను బట్టి చూస్తే, కాంగ్రెస్‌కు హార్థిక్ పెద్దగా ప్లస్ కాలేదనే అనుకోవాలి.
గుజరాత్‌లో కాంగ్రెస్‌కు అభ్యర్థులు కరువయ్యారు. గెలుపుగుర్రాలు అనదగ్గ నేతలను బీజేపీ లాగేసుకుంది. దీంతో చాలా చోట్ల క్యాండెట్స్ కరువయ్యారు. అసలు సీఎం అనదగ్గ గొప్ప నాయకుడు కూడా కాంగ్రెస్‌లో కనిపించలేదు. అహ్మద్‌పటేల్ ఉన్నా, ఆయనపై అనేక ఆరోపణలుండటంతో జనం విశ్వసించలేదనిపిస్తోంది.
హిందూ ఓట్లను కొల్లగొట్టాలని, రాహుల్ ఆలయాల సందర్శన అనే కొత్త పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు. తాను జంధ్యం వేసిన బ్రాహ్మణుడిని అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. సోమ్‌నాథ్, జగన్నాథ్ టెంపుల్స్‌తో అనేక గుళ్లూ సందర్శించి, పూజలు చేశారు. కానీ సోమ్‌నాథ్ టెంపుల్ నాన్ హిందూ రిజిస్టర్‌లో రాహుల్ పేరుపై బీజేపీ పెద్ద రాద్దాంతమే చేసి, చర్చనీయాంశం చేసింది. అంటే రాహుల్ ఆలయాల సందర్శన కలిసిరాలేదని ఎగ్జిట్‌పోల్స్ చెప్పేస్తున్నాయి.
వీటన్నింటికంటే కూడా, కాంగ్రెస్ అంటే గుజరాతీలలో పెద్దగా నమ్మకం లేకపోవడం. ఒకవేళ బీజేపీ కాదని, కాంగ్రెస్ వస్తే, మతకల్లోలాలు జరుగుతాయన్న బీజేపీ నేతల భయాలను మెజార్టీ ప్రజలు నమ్మినట్టున్నారు. ముస్లింల ప్రాబల్యం పెరుతుందన్న కొందరు బీజేపీ నేతల మాటలను విశ్వసించరామో. యూపీఏ హయాంలోలాగే, అవినీతి పెరిగి, అభివృద్ది కుంటుపడుతుందని భావించినట్టున్నారు. అందుకే ఎందుకైనా మంచిది అన్నట్టుగా కాషాయ నాయకత్వానికే ఓటేసినట్టున్నారు. ఇలా కాంగ్రెస్ బలహీనతలే, బీజేపీకి ప్లస్సులయ్యాయి. కానీ ఎగ్జిట్‌పోల్స్‌ను బట్టి చూస్తే, కాంగ్రెస్‌కు కాస్త ఊరటనిచ్చే విషయం ఏంటంటే, ఓట్లు, సీట్ల శాతం పెరుగుతాయని అంచనా వేయడం.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
Heavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMTKidney Stone: బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా.. అసలు విషయం...
12 Aug 2022 1:30 PM GMTRajagopal Reddy: నా త్యాగంతోనే మునుగోడు అభివృద్ధి జరుగుతోంది..
12 Aug 2022 1:00 PM GMTమునుగోడులో బీజేపీదే విజయం: డా.లక్ష్మణ్
12 Aug 2022 12:45 PM GMTDiabetes: చిన్న పిల్లల్లో విజృంభిస్తున్న మధుమేహం.. కారణం ఏంటంటే..?
12 Aug 2022 12:30 PM GMT