టీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్‌ నేతల క్యూ.. రెండ్రోజుల్లో జాబితా ప్రకటన..

nanireddy
Updated on: 24 Dec 2018 2:48 PM IST
టీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్‌ నేతల క్యూ.. రెండ్రోజుల్లో జాబితా ప్రకటన..
X

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఊహాగానాల నేపథ్యంలో నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో బలంగా ఉన్న అధికార తెరాసలోకి వలసలు ఉంటాయని కొంతమంది రాజకీయ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. కాగా ప్రగతి నివేదన సభ ద్వారా తెరాస బలమెంతో రుజువైందన్నారు మాజీ మంత్రి దానం నాగేందర్. ఈ సందర్బంగా టీఆర్ఎస్ లోకి భారీగా వలసలు ఉంటాయన్న దానం.. తమ పార్టీలో చేరేవారి జాబితాను రెండ్రోజుల్లో ప్రకటిస్తానని తెలిపారు. గాంధీభవన్‌లో ఇమడలేక.. ప్రతిరోజూ గొడవలకు తోడు.. సరైన ప్రాతినిధ్యం లేక కాంగ్రెస్ నేతలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తద్వారా రాజకీయా మార్పు కోరుకుంటున్నారని. త్వరలోనే తమ పార్టీలో చేరడానికి చాలామంది నాయకులు సిద్ధంగా ఉన్నారని అన్నారు దానం నాగేందర్.

nanireddy

nanireddy

Next Story