గవర్నర్‌, కాంగ్రెస్‌ నేతల మధ్య వాగ్వాదం

గవర్నర్‌, కాంగ్రెస్‌ నేతల మధ్య వాగ్వాదం
x
Highlights

తెలంగాణలో ఇసుక తుఫాను రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధాన్ని రాజేసింది. కారేగావ్ ఇష్యూని ఇసుక మాఫియా భుజానపెట్టి.. ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది...

తెలంగాణలో ఇసుక తుఫాను రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధాన్ని రాజేసింది. కారేగావ్ ఇష్యూని ఇసుక మాఫియా భుజానపెట్టి.. ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ అంశం అధికార పార్టీకి గుదిబండలా మారితే.. ప్రధాన ప్రతిపక్షానికి మాత్రం ఆయుధంలా మారింది. అదే స్పీడుతో రాజ్ భవన్ కు వెళ్లిన కాంగ్రెస్ నేతలు.. సీన్ రివర్స్ కావడంతో, అంతకన్నా స్పీడుగా బయటకొచ్చేశారు.

ఇసుక మాఫియాపై తెలంగాణలో భారీ దుమారమే చేలరేగుతోంది. కారేగావ్ లో మృతిచెందిన సాయిలు అసలు వీఆర్ఏనే కాదని అధికార పక్షం అంటూటే.. ఇసుక మాఫియానే వీఆర్ఏని బలి తీసుకుందని కాంగ్రెస్ అంటోంది. రాష్ట్రంలో ఇసుక అక్రమాలపై గవర్నర్ ను కలిసి వివరించారు కాంగ్రెస్ నేతలు. ఈ క్రమంలోనే గవర్నర్ నర్సింహ్మన్ తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారని తెలుస్తోంది.

ఇసులు అక్రమాలపై గవర్నర్ కు వివరించే సందర్భంలో ఆయన లైట్ తీసుకున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. దీంతో ఆగ్రహానికి లోనైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, సర్వే సత్యనారాయణ ఇద్దరూ గవర్నర్ తో వాగ్వాదానికి దిగారట. వినతిపత్రం ఇచ్చే సమయంలో మీరు గవర్నర్ లా కాకుండా టిఆర్ఎస్ నాయకుని లా వ్యవహరిస్తున్నారని కామెంట్ చేశారని తెలుస్తోంది. నాడు సమైక్య రాష్ట్రంలో సోనియా దయతో మీరు గవర్నర్‌ అయ్యారు ఇప్పుడు కేంద్రంలో పైరవీలు చేసుకుంటూ పదవి కొనసాగించుకుంటున్నారని సర్వే సత్యనారాయణ మండిపడ్డారట. వారి కామెంట్స్ తో సీరియస్ అయిన గవర్నర్ కామారెడ్డిలో ఇసుక మాఫియా కారణంగా చనిపోయిన వ్యక్తి విఆర్ఎ కాదని తనకు సమాచారం ఉందని అన్నట్లు తెలిసింది.

ఇదే వివాదంపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ వీఆర్ఏని తొక్కిన ఇసుక ట్రాక్టర్ అని మీడియాలో వచ్చిందన్నారు. చనిపోయిన వ్యక్తి అసలు వీఆర్ఏ కాదని మీడియా వార్తను సవరించుకోవాలన్నారు. సంచలనాల కోసం వార్తలు రాయొద్దని ప్రజలను తప్పుదారి పట్టించొద్దన్నారు.

మరోవేపు, కారేగావ్ వీఆర్ఏ సాయిలు హత్యపై కలెక్టర్, జిల్లా ఎస్పీ వివరణ ఇచ్చారు. కామారెడ్డి జిల్లా కారేగావ్ కాకివాగు ఇసుక రీచ్ కాదని కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. మృతుడు సాయిలు వీఆర్ఏ కాదని సాయిలు బాబాయ్ వీఆర్ఏ అని చెప్పారు. ఇసుక మాఫియా వల్ల సాయిలు చనిపోలేదన్నారు. ప్రమాదవశాత్తు ఇటుక ట్రాక్టర్ ఢీ కొట్టడం వల్లే మృతి చెందాడని ఎస్పీ శ్వేతా రెడ్డి అన్నారు. మద్యం మత్తులో సాయిలు కారేగావ్ శివారులో పడిపోయిన సాయులు ప్రమాదవశాత్తు చనిపోయాడని చెప్పారు. మొత్తం మీద ఇసుక తుపాను రాజకీయ పార్టీలను చుట్టేస్తోంది. సాయిల విషయం ఎలా ఉన్నా.. ఇసుక మాఫియాను పేరుతో మరోసారి అధికారపార్టీని టార్గెట్ చేస్తూ ముందుకెళ్తున్నారు కాంగ్రెస్ నేతలు.

Show Full Article
Print Article
Next Story
More Stories