మాజీ సీఎం సిద్ధరామయ్యపై ముప్పేట దాడి!
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజకీయంగా ప్రస్తుతం సొంతపార్టీనుంచే ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. పార్టీ నేతలే తిరగబడుతున్నారు. తమ ఓటమికి స్వయంగా ఆయనే కారణమంటూ ముప్పేట దాడికి దిగుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటమికి ముమ్మాటికీ ఆయనే కారణమని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా పార్టీలో కొన్ని గ్రూపులను పెంచి పోషించారని, అధికారంలో ఉన్నప్పుడు అందరిని కలుపుకుపోలేదని, ప్రభుత్వ కార్యక్రమాల్లో కార్యకర్తలకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదు, పైగా కొన్ని చోట్ల కాంగ్రెసేతర నేతలకు ప్రాధాన్యత కల్పించారని సిద్ధుపై మండిపడుతున్నారు. దీంతో మాజీ సీఎం సిద్దరామయ్య సొంత పార్టీ నేతలకే వివరణ ఇచ్చుకోవలసి వస్తోంది.
Next Story




