ముందస్తు సంకేతాలతో టీకాంగ్రెస్‌ ఎన్నికల వ్యూహం

x
Highlights

ముందస్తు సంకేతాలతో తెలంగాణ కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. రాహుల్‌ టూర్‌తో కాంగ్రెస్‌ శ్రేణుల్లో వచ్చిన ఉత్సాహాన్ని కంటిన్యూ చేసేందుకు ఐదో...

ముందస్తు సంకేతాలతో తెలంగాణ కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. రాహుల్‌ టూర్‌తో కాంగ్రెస్‌ శ్రేణుల్లో వచ్చిన ఉత్సాహాన్ని కంటిన్యూ చేసేందుకు ఐదో విడత బస్సు యాత్రకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్‌ మొదటి వారంలో బస్సెక్కాలనుకుంటోన్న టీకాంగ్రెస్‌ నేతలు ఈసారి కొంచెం డిఫరెంట్‌గా యాత్రకు ప్లాన్ చేస్తున్నారు.

ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారంతో తెలంగాణ కాంగ్రెస్‌ బస్సు యాత్రకు సిద్ధమవుతోంది. ఇప్పటికే నాలుగు విడతల యాత్ర పూర్తి చేసిన టీకాంగ్రెస్‌ లీడర్లు సెప్టెంబర్‌ 30నుంచి ఐదో విడత బస్సు యాత్రను చేపట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ముందస్తు సంకేతాలతో ఈసారి రెండు దఫాల్లో యాత్ర పూర్తయ్యే ప్లాన్‌ చేసుకుంటున్నారు. రోజుకి రెండు మూడు నియోజకవర్గాలు కవర్‌ చేసేలా షెడ్యూల్‌ను సిద్ధంచేసుకుంటున్నారు. గతంలో 38 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర పూర్తవగా, రాహుల్‌గాంధీ టూర్‌తో హైదరాబాద్‌, రంగారెడ్డి పరిధిలోని 24 నియోజకవర్గాల్లో యాత్ర కంప్లీట్‌ అయినట్లేనని భావిస్తున్నారు. దాంతో మిగతా నియోజకవర్గాల్లోనే బస్సు యాత్ర జరిగేలా రూట్‌ మ్యాప్‌ రూపొందిస్తున్నారు.

ఇక బస్సు యాత్ర జరిగే ఉత్తర తెలంగాణలో ఏదో ఒక సభకు సోనియా లేదా రాహుల్‌‌ను తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. సోనియాగాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైందనే నినాదాన్ని ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఇక రాహుల్‌ వస్తే బస్సు యాత్రకు మరింత ఊపు వస్తుందని టీకాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. మొత్తానికి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామనే సంకేతాలను బస్సు యాత్ర ద్వారా పంపాలని భావిస్తోంది తెలంగాణ కాంగ్రెస్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories