విజయ్ బెడ్ రూంలో ఎంతోమంది అమ్మాయిలు

lakshman
Updated on: 24 Dec 2018 12:25 PM IST
విజయ్ బెడ్ రూంలో ఎంతోమంది అమ్మాయిలు
X

కొద్దిరోజుల క్రితం హాస్యనటుడు విజయ్ సాయి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే తన ఆత్మహత్యకు కారణం భార్య వనిత కారణమంటూ విజయ్ తీసిన కొన్ని సెల్ఫీ వీడియోలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ వీడియోల్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇదిలా ఉంటే వనిత విజయ్ కారును దొంగిలించారనే ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలపై స్పందించిన వనిత ఆకారు తనదేనని ..కారు కోసం హ్యుందాయ్ షోరూమ్ వాళ్లని తీసుకెళ్లానని వెల్లడించింది. అంతేకాదు విజయ్ సాయి ఇంటి నుంచి తాను కారు దొంగలించుకుని తీసుకెళ్లానని వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని.. వాస్తవాలను తెలుసుకోకుండా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. విజయ్ ఎంతోమంది అమ్మాయిలను బెడ్‌రూమ్‌కి తీసుకొచ్చేవాడని.. డబ్బు కోసం వేధించేవాడని.. తనను ఎన్నోసార్లు కొట్టాడని వనిత కన్నీటి పర్యంతమైంది. విజయ్‌కి సినిమాలు లేకపోయినప్పటికీ.. కలిసి బతుకుదామని భరోసా ఇచ్చినా... అతడు తనపై చెడు ప్రచారం చేశాడని వాపోయింది.

lakshman

lakshman

Next Story