ఆ విషయంలో మా ఆవిడ వార్నింగ్‌ ఇచ్చింది!

nanireddy
Updated on: 24 Dec 2018 1:50 PM IST
ఆ విషయంలో మా ఆవిడ వార్నింగ్‌ ఇచ్చింది!
X

జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ తొలిసారి హీరో అవతారం ఎత్తి 'శంభో శంకర' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శుక్రవారం (జూన్ 29) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా షకలక శంకర్ మాట్లాడుతూ.. నన్ను కమెడియన్‌గా ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. అయితే నా స్థాయికి తగ్గ పాత్రలు మాత్రం రావడం లేదు. అందుకే హీరో అయ్యా. అంతేగాని ఏదో పొడిచేద్దామని మాత్రం కాదు. ఈ సినిమా కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది.

నేను హీరోగా చేస్తా డబ్బులు పెట్టమంటే చాలా మంది వెనకడుగువేశారు. త్రివిక్రమ్, దిల్ రాజు, అల్లు శిరీష్‌లు దగ్గరకు కథ పట్టుకుని తిరిగా.. డబ్బులు పెట్టండి మీకు లాభాలు వస్తాయి అలాంటి కథ ఇదని చెప్పా. అయితే వాళ్లు తరువాత చూద్దాం అన్నారు. కానీ కథను నమ్మి ఈ సినిమాను నిర్మించారు రమణారెడ్డి, సురేష్ కొండేటి వారికీ నా ధన్యవాదాలు అన్నారు.

ఇక డబ్బు విషయానికొస్తే సినిమా నిర్మించే అంత స్తోమత ఉంటే ఎప్పుడో పవర్ స్టార్ తో నిర్మించేవాడిని. మొన్నటి దాకా ఆర్థికంగా అందరికీ సహాయపడుతుండే వాణ్ణి. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉందాం అనుకుంటున్నా. మా ఆవిడ వార్నింగ్‌ కూడా ఇచ్చింది అని తన ప్రసంగాన్ని ముగించారు షకలక శంకర్.

nanireddy

nanireddy

Next Story