జగన్‌ బర్త్‌ డే సందర్భంగా చంద్రబాబు విషెస్‌

జగన్‌ బర్త్‌ డే సందర్భంగా చంద్రబాబు విషెస్‌
x
Highlights

వాళ్లిద్దరూ విభిన్న ధృవాలు. అజాత శత్రులు. ఎనీ టైమ్‌, ఎనీ ప్లేస్‌ కయ్యానికి కాలుదువ్వుతారు. సై అంటే సై అంటారు. అలాంటి వాళ్లిద్దరిలో ఈరోజు ఒకరిది బర్త్‌...

వాళ్లిద్దరూ విభిన్న ధృవాలు. అజాత శత్రులు. ఎనీ టైమ్‌, ఎనీ ప్లేస్‌ కయ్యానికి కాలుదువ్వుతారు. సై అంటే సై అంటారు. అలాంటి వాళ్లిద్దరిలో ఈరోజు ఒకరిది బర్త్‌ డే. మరి ప్రత్యర్థి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తాడా అంటే ట్విట్టర్‌ వేదికగా చెప్పకనే చెప్పారు సీఎం చంద్రబాబు. వైసీపీ అధినేత జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆశీర్వదించారు. మే గాడ్‌ బ్లెస్‌ యూ, విత్‌ ఏ హ్యాపీ అండ్‌ హెల్తీ లైఫ్‌ అంటూ చంద్రబాబు చేసిన ట్వీట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. గత ఏడాది కూడా అసెంబ్లీ సమావేశాల్లో జగన్ సీటు వద్దకు వెళ్లి కరచాలనం చేసి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న జగన్ ప్రస్తుతం అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. పాదయాత్రలో భాగంగానే అభిమానులు, కార్యకర్తల మధ్య తన పుట్టినరోజు వేడుకలను జగన్ జరుపుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories