ఏపీ అసెంబ్లీ స్కిన్ డిజైన్‌ సిద్ధం

ఏపీ అసెంబ్లీ స్కిన్ డిజైన్‌ సిద్ధం
x
Highlights

నవ్యాంధ్ర కొత్త అసెంబ్లీ స్కిన్ డిజైన్ రెడీ అయింది. దీన్ని సీఎం చంద్రబాబు పరిశీలించి, స్వల్ప మార్పులు సూచించారు. వచ్చేవారం పూర్తిస్థాయి డిజైన్...

నవ్యాంధ్ర కొత్త అసెంబ్లీ స్కిన్ డిజైన్ రెడీ అయింది. దీన్ని సీఎం చంద్రబాబు పరిశీలించి, స్వల్ప మార్పులు సూచించారు. వచ్చేవారం పూర్తిస్థాయి డిజైన్ రూపుదిద్దుకోనుంది. తిరగబడిన లిల్లీ ఫ్లవర్‌ ఆకారంలోనున్న ఏపీ అసెంబ్లీ బిల్డింగ్ నిర్మాణం రెండేళ్లలో పూర్తి కానుంది. నవ్యాంధ్ర కొత్త అసెంబ్లీ డిజైన్ ఎట్టకేలకు సిద్ధమైంది. దీనిపై రెండేళ్లు నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ కసరత్తు చేసింది. అసెంబ్లీ స్కిన్ డిజైన్ ను సీఎం చంద్రబాబుకు ఆ సంస్థ ప్రతినిధులు సమర్పించారు. ఏపీ అసెంబ్లీ కొత్త డిజైన్ తిరగబడిన లిల్లీ ఫ్లవర్‌ ఆకారంలో ఉంది. 12.4 లక్షల చ.అడుగుల విస్తీర్ణం, 250 మీటర్ల ఎత్తు, 200మీ. పొడవు, వెడల్పుతో అసెంబ్లీ నిర్మాణం ఉంది. అసెంబ్లీ టవర్‌లో రెండు గ్యాలరీలు, ర్యాంపు ఉన్నాయి. అసెంబ్లీ డిజైన్ ను పరిశీలించిన సీఎం చంద్రబాబు స్వల్ప మార్పులను నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధులకు సూచించారు. ఫైనల్ డిజైన్ ను వచ్చే వారంలోగా అందజేయాలని కోరారు. త్వరలో అసెంబ్లీ బిల్డింగ్ కు టెండర్లు పిలుస్తామని మంత్రి నారాయణ తెలిపారు. నవ్యాంధ్ర అసెంబ్లీ నిర్మాణం రెండేళ్లలో పూర్తి అవుతుందని మంత్రి నారాయణ ధీమా వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories