logo
సినిమా

రిలీజ్ కు ముందే రికార్డ్ బ్రేక్ చేసిన 'సైరా'

రిలీజ్ కు ముందే రికార్డ్ బ్రేక్ చేసిన సైరా
X
Highlights

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా స్వాతంత్ర్య సమరయోధుయాడు ఉయ్యాలావాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను...

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా స్వాతంత్ర్య సమరయోధుయాడు ఉయ్యాలావాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సురేందర్ రెడ్డి. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే చిరు బర్త్ డే సందర్బంగా ఇవాళ ఓ టీజర్ విడుదలైంది. చిరంజీవి స్టామినా ఏంటో ఆ టీజర్ మరోసారి రుజువు చేసింది. టీజర్‌లో సైరా నరసింహారెడ్డిగా చిరు లుక్‌ను రివీల్‌ చేశారు. అంతేకాదు ఈ యుద్ధం ఎవరిది అంటూ చిరు చెప్పిన డైలాగ్‌తో కట్ చేసిన టీజర్‌లో భారీ గ్రాఫిక్స్‌, చిరు గెటప్‌, సెట్స్‌ ఇలా అన్ని టీజర్ కు హైలేట్ గా నిలిచాయి. ఈ టీజర్ యూట్యూబ్ లోకి వచ్చిన కొన్ని గంటల్లోనే దాదాపు 30 లక్షల వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇక ట్విట్టర్, పేస్ బుక్ లను కూడా కలుపుకుంటే సైరా టీజర్ 50 లక్షల వ్యూస్ ను సొంతం చేసుకున్నట్టు కనిపిస్తోంది. కాగా ఈ చిత్రాన్ని చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ద్వారా నిర్మిస్తున్నారు. మాస్ చిత్రాల స్పెషలిస్ట్ గా పేరొందిన సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చిరు సరసన కేరళ బ్యూటీ నయనతార నటిస్తున్నారు. బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌తో పాటు జగపతి బాబు, సుధీప్‌, విజయ్‌ సేతుపతిలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Next Story