పసిపిల్లల్ని చంపి ప్రియుడితో పరారైన మహిళ.. పోలీసులకు చెప్పిన విషయాలు చూస్తే..

ప్రియుడి మోజులో పడి కన్న కొడుకు, కూతురిని హత్య చేసిన కేసులో నిందితురాలు అభిరామి హత్యకు గల కారణాలు...
ప్రియుడి మోజులో పడి కన్న కొడుకు, కూతురిని హత్య చేసిన కేసులో నిందితురాలు అభిరామి హత్యకు గల కారణాలు వెల్లడించింది. భర్తను హత్య చేయాలనుకున్నానని, అయితే వీలుకానందున ఇద్దరి పిల్లల్లకు విషమిచ్చి చంపినట్లు నేరాన్ని అంగీకరించింది చెన్నైకి చెందిన అభిరామి. ఇవాళ(సోమవారం) పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో.. తన భర్త సరిగా ఇంటికి రాడని, తనను రోజు అనుమానించేవాడని దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవని పేర్కొంది. ఇలా ఉండగా తనకు బిర్యానీ దుకాణంలో పనిచేసే సుందరంతో పరిచయం ఏర్పడిందని, ఈ పరిచయం ప్రేమగా మారింది. భర్త ఇంట్లో లేని సమయంలో బిర్యానీ ఆర్డర్ చేసి, సుందరాన్ని తరచూ ఇంటికి రప్పించుకునే దాన్నని తెలిపింది. ఈ విషయం భర్తకు తెలిసి మందలించడంతో అతన్ని హత్య చేయాలని అనుకుని అతనిమీద కోపంతో పిల్లల్ని హత్య చేసినట్టు వెల్లడించింది.
కాగా చెన్నై పల్లావరం కుండ్రత్తూర్‌కి చెందిన విజయ్(34) బ్యాంక్ ఉద్యోగి అతనికి అభిరామి(28) భార్య , వారికీ అజయ్(5) అనే కుమారుడు, కారుణ్య(4) అనే కుమార్తె ఉన్నారు. మూడు నెలల కిందట అభిరామికి స్థానిక బిర్యానీ హోటల్ లో పనిచేసే సుందరం అనే యువకుడితో పరిచయం ఏర్పరుచుకుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి వివాహేతరసంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో భర్తకు తెలియకుండా సుందరంను కలుస్తూ ఉండేది అభిరామి. అయితే వీరి వ్యవహారం ఇరుగుపొరుగు వారికీ తెలిసి భర్త విజయ కు చెప్పారు. అతను ఆమెను మందలించాడు. శుక్రవారం బ్యాంక్‌లో పని అధికంగా ఉంటుందని, ఆలస్యంగా వస్తానని భార్యతో చెప్పి విజయ్ బ్యాంకుకు వెళ్ళాడు. రాత్రి ఇంటికి వచ్చిన అతడు… ఇంటి తలుపులు మూసివుండడం, ఇంట్లో లైట్లు వెలుగుతుండడంతో తన వద్ద ఉన్న మరో తాళంతో తలుపులు తెరిచి లోపలికి వెళ్ళాడు. ఇంట్లో ఇద్దరుపిల్లలు నోట్లోనుంచి నురగలు కక్కుకుని మరణించి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన చెన్నై పోలీసులు నిందితులను కేరళలో అదుపులోకి తీసుకున్నారు.
Jayasudha: బీజేపీలోకి సినీనటి జయసుధ...?
9 Aug 2022 8:03 AM GMTటీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై కేసు నమోదు
9 Aug 2022 7:50 AM GMTTelangana News: వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియపై హైకోర్టు స్టే
8 Aug 2022 9:38 AM GMTBreaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMT
గోరంట్ల మాధవ్ విషయంలో అతిగా స్పందించొద్దు.. వంగలపూడి అనితకు బెదిరింపు...
9 Aug 2022 10:22 AM GMTTelangana News: కన్నుల పండువగా.. ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ
9 Aug 2022 10:13 AM GMTBigg Boss 6 Telugu: అప్పగింతల కాన్సెప్ట్‌తో 'బిగ్‌బాస్' ప్రోమో.....
9 Aug 2022 10:00 AM GMTCash Deposit: ఈ 2 పత్రాలు లేకుండా మనీ డిపాజిట్ కష్టమే.. ఎందుకంటే..?
9 Aug 2022 9:15 AM GMTఎపిక్ ప్రేమ కథ అంటే అది అని రాధాకృష్ణ ని ట్రోల్ చేస్తున్న ప్రభాస్...
9 Aug 2022 8:30 AM GMT