logo
సినిమా

చైతూ, సమంత పెళ్లి విషయంలో క్లారిటీ

చైతూ, సమంత పెళ్లి విషయంలో క్లారిటీ
X
Highlights

టాలీవుడ్‌లో నాగచైతన్య, సమంత జంట ఎంత ప్రత్యేకమో చెప్పనక్కర్లేదు. ఏ మాయ చేసావే సినిమాతో మొదలైన వారి ప్రేమ పయనం...

టాలీవుడ్‌లో నాగచైతన్య, సమంత జంట ఎంత ప్రత్యేకమో చెప్పనక్కర్లేదు. ఏ మాయ చేసావే సినిమాతో మొదలైన వారి ప్రేమ పయనం త్వరలో పెళ్లి వైపు అడుగులు వేయబోతోంది. ఇప్పటికే వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అప్పుడెప్పుడో మహేశ్ బాబు తన సినిమాలో నటించిన నమ్రతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత టాలీవుడ్‌లో ఇలా సినిమాతో ఒక్కటైన జంట పెళ్లి చేసుకున్న సందర్భం లేదు. మళ్లీ చాలా కాలం తర్వాత వీరి పెళ్లితో ఆ హిస్టరీ రిపీట్ కాబోతోంది. అయితే ఈ జంటకు నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి రకరకాల ఊహాగానాలు ప్రచారంలోకొచ్చాయి. శ్రియా భూపాల్‌తో అఖిల్ నిశ్చితార్థం జరిగి.. పెళ్లి రద్దు కావడంతో చైతూసమంతల పెళ్లిని గుట్టుచప్పుడు కాకుండా చేయాలని అక్కినేని కుటుంబం భావిస్తుందంటూ పుకార్లొచ్చాయి. అలాంటిదేమీ లేదని తాజాగా తేలిపోయింది.

నాగచైతన్య, సమంతల పెళ్లి వేడుక గోవాలో ఘనంగా జరపాలని అక్కినేని కుటుంబం నిర్ణయించినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. దాదాపు 150 కుటుంబాలకు పెళ్లికి సంబంధించి ఇప్పటికే శుభలేఖలు అందాయి. అక్టోబర్6, 7 తేదీల్లో వీరిద్దరి పెళ్లి ఘనంగా జరగనుంది. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు ఈ వివాహానికి హాజరుకానున్నారు. పెళ్లి గోవాలో చేస్తుండటంతో కొందరు షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల రాలేకపోవచ్చని, అలాంటి వారి కోసం హైదరాబాద్‌లో భారీగా రిసెప్షన్‌కు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

Next Story