ముగ్గులేస్తున్నారా.. అయితే జాగ్రత్త

x
Highlights

హైదరాబాద్ లో చైన్న స్నాచర్లు రెచ్చిపోతున్నారు.. తాజాగా మియాపూర్‌లో ఓ చైన్ స్నాచర్ పావుగంట వ్యవధిలో రెండు చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డాడు.. వెంకటరమణ...

హైదరాబాద్ లో చైన్న స్నాచర్లు రెచ్చిపోతున్నారు.. తాజాగా మియాపూర్‌లో ఓ చైన్ స్నాచర్ పావుగంట వ్యవధిలో రెండు చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డాడు.. వెంకటరమణ కాలనీ గోకుల్ ప్లాట్స్ దగ్గర నిన్న రాత్రి 7.45గంటల సమయంలో బైక్‌పై వచ్చిన ఓ దుండగుడు మహిళ మెడలోంచి 5 తులాల పుస్తెల తాడును తెంపుకెళ్లాడు. 8 గంటల సమయంలో అదే దుండగుడు వసంత్‌నగర్‌లో మరో మహిళ మెడలోంచి పుస్తెల తాడును లాక్కొని వెళ్లిపోయాడు.

దుండగుడు బ్లాక్ అండ్ వైట్ చెక్స్ షర్ట్ ధరించి ఉన్నాడని, హెల్మెట్ పెట్టుకోలేదని బాధిత మహిళలు పోలీసులకు తెలిపారు. వసంత్‌నగర్‌లో ఓ ఇంటి ముందు నిల్చొని ఉన్న మహిళ దగ్గర బైక్ ఆపిన దుండగుడు.. ఆంటీ.. ఈ ముగ్గు ఎవరు వేసారంటూ అంటూ ప్రశ్నించాడు. ఆమె సమాధానం చెప్పేలోపే పుస్తెల తాడు లాక్కొని ఉడాయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దుండగుణ్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.. వెలుతురు సరిగా లేకపోవడంతో నిందితుడి బైక్ నంబర్ సరిగా కనిపించడం లేదు. దుండగుడు మియాపూర్ ఆల్విన్ కాలనీ జంక్షన్ నుంచి కేపీహెచ్‌బీ దిశగా వెళ్లినట్లు ఫుటేజీల ద్వారా తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories