సెల్‌కాన్ లైఫ్‌టైమ్ వారంటీ ఆఫర్

lakshman
Updated on: 24 Dec 2018 12:09 PM IST
సెల్‌కాన్ లైఫ్‌టైమ్ వారంటీ ఆఫర్
X

త్వరలో 2,999లకే 4జీ స్మార్ట్‌ఫోన్
ప్రతి జిల్లాలోనూ సొంత సర్వీస్ సెంటర్
సెల్‌కాన్ చైర్మన్, ఎండీ వై.గురు వెల్లడి


ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ సెల్కాన్ దేశంలో తొలిసారిగా వినూత్నమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఎంపిక చేసిన ఫీచర్ ఫోన్లపై జీవితకాల వారంటీ ఆఫర్‌ను ఆవిష్కరించింది. ఈ ఆఫర్ బాగా అమ్ము డవుతున్న కొన్ని పాపు లర్ హ్యాండ్సెట్లకే వర్తిస్తుందని, ఆ తర్వాత ఇతర ఫోన్లకు కూడా విస్తరిస్తామని కంపె నీ తెలిపింది. ఆఫర్లో భాగంగా యూజర్లు వారి ఫోన్లను ఎన్ని సంవత్సరాల పాటైనా (జీవితాంతం) ఉచితంగా రిపేర్ చేయించుకోవచ్చు. ‘అన్ని ఫోన్లను దేశీయంగానే తయారు చేస్తున్నాం. నాణ్యతపై పూర్తిగా పట్టు సాధించాం. కంపెనీ వృద్ధికి కారణం గా నిలిచిన వినియోగదారులకు ఏదైనా తిరిగి ఇవ్వాలనిపించింది. అందుకే ఈ జీవితకాల వారంటీ ఆఫర్ను ఆవిష్కరించాం అని సెల్కాన్ మొబైల్స్ చైర్మన్, ఎండీ వై.గురు తెలిపారు. అలాగే డిసెంబర్ చివరి నాటికి నెలకు 10 లక్షల ఫోన్ల విక్రయాలను లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలియజేశారు. మొబైల్ హ్యాండ్సెట్లను స్థానికంగా విక్రయించడమే కాకుండా ఎగుమతి కూడా చేస్తున్నామన్నారు.

lakshman

lakshman

Next Story