నటి నీలాణిపై కేసు నమోదు

nanireddy
Updated on: 24 Dec 2018 2:59 PM IST
నటి నీలాణిపై కేసు నమోదు
X

బుల్లితెర నటి నీలాణిపై చెన్నై మధురవాయిల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. తన తమ్ముడు గాంధీలలిత్‌కుమార్‌ ఆత్మహత్యకు నటి నీలాణినే కారణం పోలీసులకు ఫిర్యాదు చేశారు అయన
సోదరుడు. స్టెర్‌లైట్‌ పోరాట దృశ్యాలను పోలీసు దుస్తులు ధరించి అనధికారంగా చిత్రీకరించి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసి సంచలన సృష్టించిన నటి నీలాణి. ఈ సంఘటనలో అరెస్ట్‌ అయ్యి బెయిల్‌పై విడుదలై మళ్లీ టీవీ.సీరియళ్లలో నటిస్తోంది. అయితే నీలానికి ఇదివరకే గాంధీలలిత్‌కుమార్‌ అనే సహాయ దర్శకుడితో పరిచయం ఉంది. కొంతకాలంగా ఆమెను తనను పెళ్లిచేసుకోవలసిందిగా వేధింపులకు గురిచేస్తున్నాడు గాంధీలలిత్‌కుమార్‌. దాంతో ఆమె గాంధీలలిత్‌కుమార్‌ పై మైలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె తనపై పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని అవమానంగా భావించిన గాంధీలలిత్‌కుమార్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు అలా చేసుకున్న కొద్ది గంటల్లోనే నటి నీలాని కూడా దోమలమందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఇక తన తమ్ముడి మరణానికి నీలాణినే కారణమని ఆమెపై చర్యలు తీసుకోవలసిందిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు గాంధీలలిత్‌కుమార్‌ సోదరుడు.

nanireddy

nanireddy

Next Story