ఖైరతాబాద్‌లో కారు బీభత్సం

arun
By arun
Updated on: 24 Dec 2018 3:40 PM IST
ఖైరతాబాద్‌లో కారు బీభత్సం
X

నిత్యమూ అత్యంత రద్దీగా ఉండే ఖైరతాబాద్ చౌరస్తాలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఎర్రమంజిల్ వైపు నుంచి వేగంగా వచ్చిన కారు, నక్లెస్ రోడ్డు ఫ్లయ్ ఓవర్ పై అదుపుతప్పి, డివైడర్ ను ఢీకొని అవతలివైపు పడిపోయింది. కారులో దంపతులు ప్రయాణిస్తుండగా... వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం సమయంలో అవతలివైపు నుంచి ఎటువైపు నుంచి మరే ఇతర వాహనాలూ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మార్నింగ్ వాక్ కు వచ్చివారు వెంటనే స్పందించి, గాయపడిన వారిని కారు నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఘటన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని సందర్శించి, కేసు నమోదు చేశారు.

arun

arun

Next Story