కేంద్రబడ్జెట్ లో ప్రజారోగ్యానికి పెద్దపీట

కేంద్రబడ్జెట్ లో ప్రజారోగ్యానికి పెద్దపీట
x
Highlights

దేశంలోని 125 కోట్ల ప్రజారోగ్యమే లక్ష్యంగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ 2018 బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఆరోగ్యరంగానికి లక్షా 38వేల...

దేశంలోని 125 కోట్ల ప్రజారోగ్యమే లక్ష్యంగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ 2018 బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఆరోగ్యరంగానికి లక్షా 38వేల కోట్ల రూపాయలు కేటాయించడం ద్వారా
2019 ఎన్నికల్లో ఓటర్లకు వలవేయటానికి రంగం సిద్ధం చేశారు. బడ్జెట్లో ప్రజారోగ్యానికి కేటాయింపుల హైలైట్స్...

ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ..పార్లమెంట్ లో 2018 సంవత్సరానికి సమర్పించిన కేంద్రబడ్జెట్ ప్రజారోగ్యమే ప్రభుత్వానికి 2019 ఎన్నికల్లో ఓట్ల మహాభాగ్యంగా సాగింది. దేశంలోని 125 కోట్ల ప్రజల ఆరోగ్యంపై కేంద్రప్రభుత్వానికి గతంలో ఎన్నడూలేని విధంగా ఎక్కడలేని ప్రేమపుట్టుకువచ్చింది. ప్రజారోగ్యం కోసం లక్షా 38వేల కోట్ల రూపాయలు కేటాయించడంతో పాటు సరికొత్తగా పలు ఆరోగ్యపథకాలను సైతం ఆర్థికమంత్రి ప్రకటించారు. 2017 కేంద్ర ఆరోగ్య విధానంలో భాగంగా ఆయుష్మాన్ భారత్ పథకానికి అధికప్రాధాన్యమిచ్చినట్లు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తమ ప్రసంగపాఠంలో పేర్కొన్నారు.

దేశంలోని 50 కోట్లమంది ప్రజలకు తమ ఈ తాజా కేటాయింపులు, పథకాలతో ఆరోగ్య బీమా ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. దేశప్రజలకు మరిన్ని ఆరోగ్యకేంద్రాలు అందుబాటులో ఉండటం కోసం 1200 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా కేటాయించారు. ఈ నిధులతో దేశవ్యాప్తంగా వెల్ నెస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. మొత్తం కోటీ 50 లక్షల వెల్ నెస్ కేంద్రాల ద్వారా ఆరోగ్యసేవలు అందించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. దేశంలో రానురాను పెరిగిపోతున్న క్షయవ్యాధిగ్రస్థుల మరణాలను తగ్గించడం పైనా కేంద్రం ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. టీబీ వ్యాధిగ్రస్థులకు బలవర్థక ఆహారం అందించడానికి 600 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ నిధి నుంచి ఒక్కో క్షయవ్యాధిగ్రస్థుడికి నెలకు 500 రూపాయలు చొప్పున అందచేస్తారు.

దిగువ ఆదాయవర్గాల ఉచిత వైద్యపరీక్షల కోసం 1200 కోట్ల రూపాయల ప్రత్యేకంగా కేటాయించారు. దేశంలోని 15కోట్ల మందికి ఏడాదికి 5 లక్షల రూపాయల బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఏడాదికి 330 రూపాయల ప్రీమియం కట్టిన కుటుంబాలకు మాత్రమే ఈ బీమా వర్తిస్తుంది. దేశంలోని ప్రతిమూడు నియోజకవర్గాలకు ఓ మెడికల్ కళాశాల ఏర్పాటుచేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 24 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయటానికి మార్గం సుగమం చేశారు. సీనియర్ సిటిజన్ల వైద్యఖర్చుల కోసం అదనంగా 50వేల రూపాయల మినహాయింపు కూడా ఇచ్చినట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు. అయితే హెల్త్ చెస్ పేరుతో ఒకశాతం అదనంగా పన్ను విధించడం 2018 బడ్జెట్ కు కొసమెరుపుగా మిగిలిపోతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories