చెల్లెలిపై కత్తితో దాడి చేసిన అన్న

nanireddy
Updated on: 24 Dec 2018 2:06 PM IST
చెల్లెలిపై కత్తితో దాడి చేసిన అన్న
X

కులాంతర వివాహం చేసుకుందని చెల్లెలిపై హత్యాయత్నం చేశాడు ఓ అన్న. ఈ ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వీరాపూర్‌ లో జరిగింది. గ్రామానికి చెందిన చిట్టం మౌనిక 12 రోజుల క్రితం తోటపల్లికి చెందిన సొల్లు సాయిని ప్రేమ వివాహం చేసుకుంది. అయితే అప్పటినుంచి అతన్ని వదిలించుకోవాల్సిందిగా కుటుంబసభ్యులు మౌనికపై ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో మౌనికను ఆమె అన్న నాగరాజు తీవ్రంగా హెచ్చరించాడు. దీంతో తమకు తమకు రక్షణ కల్పించాలని ఆ జంట పోలీసులను ఆశ్రయించింది. కౌన్సెలింగ్‌ కోసం శనివారం బెజ్జంకి పోలీస్‌స్టేషన్‌కు రావల్సిన మౌనికతో సోదరుడు నాగరాజు తీవ్రంగా గొడవపడ్డాడు. కులం పరువు తీస్తున్నావంటూ కత్తితో మౌనికపై దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలైన మౌనికను ఆమె తాతయ్య ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తాత ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం నాగరాజు పరారీలో ఉన్నాడు.

nanireddy

nanireddy

Next Story