28 ఏళ్ల క్రితం పోయి.. ఇప్పుడు కంట్లో దొరికింది

nanireddy
Updated on: 24 Dec 2018 2:40 PM IST
28 ఏళ్ల క్రితం పోయి.. ఇప్పుడు కంట్లో దొరికింది
X

28 ఏళ్ల క్రితం పోయి.. ఇప్పుడు కంట్లో దొరికడమేంటని ఆశ్చర్యపోతున్నారా? అసలు విషయమేంటంటే బ్రిటన్ కు చెందిన 42 ఏళ్ల మహిళ ఇటీవల కంటి సమస్యతో బాధపడుతున్నారు. దీంతో ఆమె దగ్గరలోని ఓ క్లినిక్ ను సంప్రదించింది. ఎమ్‌ఆర్‌ఐ స్కాన్‌ చేసిన వైద్యులకు ఆమె ఎడమ కంటిలో ఒక లెన్స్‌ ఉన్నట్లు తెలిసింది. అందువల్లే ఆమెకు విపరీతంగా నొప్పి కలుగుతుందని గుర్తించారు. ఆలస్యం చేయకుండా ఆపరేషన్‌ చేసి లెన్స్‌ను బయటకు తీశారు డాక్టర్లు.. అయితే ఆ లెన్స్ ను పరీక్షించగా అది 28 ఏళ్ల కిందటే ఆ మహిళ కంటిలోకి వెళ్లినట్టు తేల్చారు. ఈ విషయం సదరు మహిళకు చెప్పగా ఆమె ఒక్కసారిగా షాక్ కు గురైంది. దాంతో గతంలో జరిగిన సంఘటనను గుర్తుకు తెచ్చుకుంది. తనకు 14 ఏళ్ల వయసులో ఒక రోజు బ్యాడ్మింటన్‌ ఆడుతుండగా షటిల్‌కాక్‌ నా కళ్లకు తగిలింది. ఆ తర్వాత ఇంటికి వెళ్లి చూసుకుంటే కాంటక్ట్‌ లెన్స్‌ లేదు. షటిల్‌కాక్‌ తగిలినప్పుడే అది ఎక్కడే పడిపోయిందనుకున్నాను. కానీ అది నా కంటి లోపలికి వెళ్లి పోయి ఇన్నాళ్ల పాటు అలానే ఉండటం చూసి ఆశ్చర్యానికి లోనవుతున్నానని తెలిపింది.

nanireddy

nanireddy

Next Story