భారీ స్కెచ్ గీసింది.. భర్తను మట్టుబెట్టింది!

nanireddy
Updated on: 24 Dec 2018 1:26 PM IST
భారీ స్కెచ్ గీసింది.. భర్తను మట్టుబెట్టింది!
X

విజయనగరం జిల్లాలో దారుణం చోటుచేసుకంది. ఓ నవ వధువు భర్తను దారుణంగా చంపించింది. దోపిడీ దొంగలు చేసిన పనిగా చిత్రీకరించి.. ఆ తర్వాత లాజిక్ మిస్సై అడ్డంగా బుక్కయ్యింది. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కెల్ల గ్రామానికి చెందిన గౌరీశంకరరావు(30) , సరస్వతికి ఈ నెల 28 న వివాహం జరిగింది. అయితే గౌరీశంకరరావు తో పెళ్లి ఇష్టం లేని సరస్వతి ఎలాగైనా భర్తను వదిలించుకోవాలనుకుంది. ఈ క్రమంలో కొందరు స్నేహితులకు సుపారీ ఇచ్చి భర్త హత్యకు పథకం పన్నింది. ప్లాన్ ప్రకారం గరుగుబిల్లి మండలం తోటపల్లిలో కొత్త జంట బైక్ మీద వస్తుండగా.. దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో భర్త గౌరీశంకరరావు మృతి చెందాడు. ఐతే.. భార్య సరస్వతి కి గాయాలు అయ్యాయి. దాడి చేసిన అనంతరం దోపిడిదొంగలు నగలు అపహరించుకుపోయారు. దుండగులు భార్య మెడలో బంగారం లాక్కొని వెళ్తుండగా భర్త అడ్డుకున్నాడు. దీంతో ప్రతిఘటించిన భర్తపై వారు దాడి చేసి చంపారు. అనంతరం పరారయ్యారు. ఇదిలావుంటే ఇష్టంలేని పెళ్లి కారణంగానే గౌరీశంకరరావును భార్య సరస్వతి హత్య చేయించినట్టు పోలీసులు భావిస్తున్నారు. పథకంలో భాగంగా సరస్వతి వద్ద ఉన్న నగలు అపహరించారు. వాటిని ఎత్తుకెళ్ళిన వారిని దొంగలుగా చిత్రీకరించింది సరస్వతి. కానీ హంతకులు నగలు తీసుకొని ఉడాయించడంతో.. సరస్వతి నిర్వాకం బయటపడింది. నగలు తీసుకురావాలని సుపారీ గ్యాంగును కోరడంతో వారు హ్యాండ్ ఇచ్చారు. ఈ క్రమంలో పోలీసులు ఆమెను ఓ కంట కనిపెట్టి సరస్వతియే భర్తను హత్య చేయిందనే నిర్ణయినికి వచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు.

nanireddy

nanireddy

Next Story