కాసేపట్లో వివాహం.. వరుడు పరార్

lakshman
Updated on: 24 Dec 2018 12:12 PM IST
X

ఏలూరు: మరికొద్దిసేపట్లో తాళి కట్టాల్సిన పెళ్లి కుమారుడు పరారయ్యాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని చింతలపూడి మండలం యర్రగుంట పల్లి గ్రామానికి చెందిన రాజేష్‌కున, తాళ్లపుడి మండలం తిరుగురు మెట్టకు చెందిన ఓ యువతితో పెళ్లి నిశ్చయమైంది. శనివారం పెళ్లి తంతు నిర్వహించడానికి వధువు తరుపు బంధువులంతా కలిసి వరుడి గ్రామానికి చేరుకున్నారు. పెళ్లి మండపంలో గంటల తరబడి ఎదురు చూసినా పెళ్లికొడుకు అక్కడికి రాలేదు. ఏం జరిగిందోనని వధువు బంధువులు అతని ఇంటికి వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. చుట్టు పక్కల వారిని ఆరా తీయగా వరుడు పరారయ్యాడని చెప్పారు. పెళ్లికి ముందు మాట్లాడుకున్నట్టుగా పది లక్షల కట్నంలో ఇప్పటికే రూ. 5 లక్షలు ఇచ్చామని వధువు తల్లిదండ్రులు చెప్పారు.

lakshman

lakshman

Next Story