జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ యాత్రకు బ్రేక్..

nanireddy
Updated on: 24 Dec 2018 1:41 PM IST
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ యాత్రకు బ్రేక్..
X

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రజా పోరాట యాత్రకు విరామం ప్రకటించారు. రంజాన్ సందర్బంగా తన యాత్రను ఆపాలని నిర్ణయించుకున్నారు. తన వ్యక్తిగత సిబ్బంది ఎక్కువగా ముస్లింలు ఉండటంతోనే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జనసేన ప్రతినిధి వెల్లడించారు. రంజాన్‌ అనంతరం యాత్ర విశాఖ జిల్లాలో యథావిధిగా కొనసాగనుంది. శుక్రవారం రాత్రి ఎలమంచిలి సభను ముగించుకుని విశాఖపట్నం చేరుకున్న పవన్‌ భీమిలి బీచ్‌రోడ్డులోని సాయిప్రియ రిసార్ట్‌లో బస చేశారు. సోమవారం సాయంత్రం పవన్‌ విశాఖ నుంచి హైదరాబాద్‌ బయలుదేరుతారు.

nanireddy

nanireddy

Next Story