గుజరాత్ లో బీజేపీ వెనుకంజ..!

nanireddy
Updated on: 24 Dec 2018 12:23 PM IST

గుజరాత్‌ సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో వుంది. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం అయిన దగ్గర నుంచి కాంగ్రెస్ ఇదే స్థితిని కొనసాగిస్తోంది. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం.. కాంగ్రెస్ కు 89 చోట్ల ఆధిక్యంలో ఉండగా.. బీజేపీకి 79 చోట్ల ఆధిపత్యాన్ని కనబరుస్తోంది.

మరోవైపు హిమాచల్‌ ప్రదేశ్‌లో పోరు ఏకపక్షంగా సాగుతోంది. బీజేపీ 21 స్థానాల్లో, కాంగ్రెస్‌ 22స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉన్నాయి.

గుజరాత్‌లో 182 స్థానాలకు 1,828 మంది అభ్యర్థులు పోటీ
ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ 92 సీట్లు
హిమాచల్‌లో 68 స్థానాలకు 337 మంది అభ్యర్థుల పోటీ
ప్రభుత్వ ఏర్పాటుకు అవసరం అయిన మ్యాజిక్‌ ఫిగర్‌ 35 సీట్లు

nanireddy

nanireddy

Next Story