గుండెపోటుతో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మృతి!

nanireddy
Updated on: 24 Dec 2018 1:23 PM IST
గుండెపోటుతో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మృతి!
X

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటుచేసుకుంది. ప్రచారంలో పాల్గొన్న బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బీఎన్‌ విజయ్‌కుమార్‌(60) గుండెపోటుతో మృతిచెందారు. గురువారం సాయంత్రం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విజయ్‌కుమార్‌ అకస్మాత్తుగా కుప్పకూలారు. దీంతో ఆయనను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తుండగా రాత్రి 1 గంట ఆ ప్రాంతంలో మృతిచెందారు. రెండు సార్లు కర్ణాటకలోని జయనగర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. మూడోసారి నామినేషన వేసిన ఆయన గుండెపోటుతో మృతిచెందడంతో బీజేపీ షాక్ లో మునిగిపోయింది. కాగా విజయ్‌కుమార్‌ మాజీ ముఖ్యమంత్రి సదానంద గౌడకు సన్నిహితంగా ఉండేవారు. మూడోసారి అతికష్టం మీద జయనగర్‌ నియోజకవర్గం టికెట్ సాధించారు. మొదట 2019 పార్లమెంటుకు పోటీచేయాలని బీజేపీ విజయ్‌కుమార్‌ కు సూచిందింది కానీ అసెంబ్లీకి పోటీ చేస్తానని పట్టుబట్టడంతో ఆయనకు టికెట్ లభించిందని బీజేపీలోని ఓ వర్గం భావిస్తోంది. 60 ఏళ్ల విజయ్‌కుమార్‌ అవివాహితుడు.శుక్రవారం అయన అంత్యక్రియలు జరగనున్నాయి.

nanireddy

nanireddy

Next Story