దీప్తి ఎలిమినేషన్‌ ఖాయమా..?

nanireddy
Updated on: 24 Dec 2018 2:42 PM IST
దీప్తి ఎలిమినేషన్‌ ఖాయమా..?
X

బుల్లి తెరపై బిగ్‌బాస్ హంగామా రోజురోజుకీ రసవత్తరంగా మారుతుంది. ‘ఏదైనా జరగొచ్చు ఇంకొంచెం మసాలా’ అంటూ నేచురల్ స్టార్ నాని బిగ్ బాస్ సీజన్ 2ని చాలా డీసెంట్‌గా హ్యాండిల్ చేస్తున్నారు. ఈ షోలో సోమవారం నామినేషన్ల ఘట్టం ముగిసింది.ఈ వారం నామినేషన్స్‌లో కౌశల్, తనీష్, పూజా రామచంద్రన్, దీప్తి నల్లమోతు ఉన్నారు. దీప్తి, పూజలు డేంజర్‌ జోన్‌లో ఉన్నారు.ఎలిమినేషన్‌ ఉందంటే తెగ టెన్షన్‌ పడిపోయి దీప్తి గతవారం ఆ ప్రక్రియలో లేకపోయేసరికి కాస్త ప్రశాంతంగా కనిపించింది. కానీ ఈ సంబరం ఎంతో సేపు లేదు. ఈ వారం మళ్లీ నామినేషన్‌లోకి వచ్చాక.. తనలో మళ్లీ అదే టెన్షన్‌. అందరితో కలిసి ఉన్నానని, ఎవరు తనను నామినేట్‌ చేసుంటారా అని గణేష్‌తో తన గోడును వెలిబుచ్చుకుంది. దీంతో మునుపటిలా ప్రశాంతంగా కాకుండా దీప్తిలో ఆందోళన గమనించి వీక్షకులు ఈసారి దీప్తి అవుట్ అని అభిప్రాయపడుతున్నారు.

nanireddy

nanireddy

Next Story