నిర్మాత ఎస్‌.గోపాల్‌రెడ్డి తనయుడు మృతి

nanireddy
Updated on: 24 Dec 2018 1:25 PM IST
నిర్మాత ఎస్‌.గోపాల్‌రెడ్డి తనయుడు మృతి
X

ప్రముఖ నిర్మాత ఎస్‌.గోపాల్‌రెడ్డి తనయుడు భార్గవ్‌రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నెల్లూరు జిల్లా వాకాడు మండలం రాయిగుంటపాలెం గ్రామం దగ్గరున్న భార్గవ్‌ హెచరీస్‌ సముద్ర తీర ప్రాంతానికి.. భార్గవ్ రెడ్డి మృతదేహం లభ్యమైంది. తనయుడు భార్గవ్ ఆర్ట్స్‌ పేరుపై గోపాల్‌రెడ్డి ఎన్నో సూపర్ హిట్‌ చిత్రాల్ని నిర్మించారు. భార్గవ్‌ మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. కాగా గోపాల్ రెడ్డి 2008 లో మరణించారు. 25 ఏళ్లుగా సినిమా నిర్మాణ రంగంలో దూసుకుపోయిన ఆ కుటుంబం గోపాల్ రెడ్డి మరణంతో సినిమాలకు దూరంగా ఉంటోంది.

nanireddy

nanireddy

Next Story