యువతిపై.. క్యాబ్ డ్రైవర్ దారుణం..

nanireddy
Updated on: 24 Dec 2018 1:38 PM IST
యువతిపై.. క్యాబ్ డ్రైవర్ దారుణం..
X

కర్ణాటకలో ఓ క్యాబ్ డ్రైవర్ దారుణానికి ఒడిగట్టాడు. క్యాబ్ లో ఎక్కిన యువతిపై లైంగికదాడికి యత్నించాడు. అనూహ్యంగా అతడి భారీనుంచి తప్పించుకున్న యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే బెంగళూరుకు చెందిన యువతి(26) ముంబైకి బయలుదేరింది. క్యాబ్‌ బుక్‌ చేసుకున్న ఆమెకు బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్ళడానికి. షార్ట్‌ కట్‌ అంటూ మార్గం మళ్లించిన డ్రైవర్‌ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. కారు డోర్లు బిగించి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ఫోన్‌ లాక్కుని లొంగకపోతే తన స్నేహితులను పిలిచి గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడతానని హెచ్చరించాడు. యువతి ప్రతిఘటించటంతో చివరకు దుస్తులిప్పాలని.. లేకపోతే ప్రాణాలు తీస్తానని బెదిరించాడు. ఈక్రమంలో భయాందోళన చెందిన యువతి చివరకు దుస్తులు విప్పింది. నగ్నంగా ఉన్న సదరు యువతి ఫోటోలు తీసి వాటిని స్నేహితులకు షేర్ చేశాడు. అయితే అతడి భారీ నుంచి అతికష్టంమీద తప్పించుకున్న బాధితురాలు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసలు క్యాబ్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.

nanireddy

nanireddy

Next Story