ఇంతకీ బాల్‌‌లో ఏముంది? ఎందుకింత రాద్ధాంతం?

ఇంతకీ బాల్‌‌లో ఏముంది? ఎందుకింత రాద్ధాంతం?
x
Highlights

ఇంతకీ బాల్‌‌లో ఏముంది? ఎందుకింత రాద్ధాంతం? క్రికెట్ బాల్స్ పై మరోసారి వివాదం రాజుకొంది. భారత్ లో గత పాతికసంవత్సరాలుగా ఉపయోగిస్తున్న SG బ్రాండ్...

ఇంతకీ బాల్‌‌లో ఏముంది? ఎందుకింత రాద్ధాంతం?

క్రికెట్ బాల్స్ పై మరోసారి వివాదం రాజుకొంది. భారత్ లో గత పాతికసంవత్సరాలుగా ఉపయోగిస్తున్న SG బ్రాండ్ బాల్స్....పట్ల టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీతో సహా పలువురు టెస్ట్ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే...మాజీ కెప్టెన్ మహ్మద్ అజరుద్దీన్ మాత్రం...క్రికెటర్ల అభ్యంతరాలలో అర్ధంలేదని కొట్టి పడేశాడు. క్రికెట్ అనగానే..... బ్యాటు...బంతి మాత్రమే గుర్తుకు వస్తాయి. బ్యాటు లేదా, బంతి లేని క్రికెట్ ను ఊహించడం అసాధ్యం. మూడు శతాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన క్రికెట్....మూడు రకాల ఫార్మాట్లలో...మూడు వేర్వేరు రంగుల బంతులను ఉపయోగిస్తున్నారు. ఐదురోజులపాటు జరిగే...సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో....యాపిల్ రంగు బాల్స్ తో పాటు...డే-నైట్ టెస్ట్ మ్యాచ్ ల్లో ...గులాబీ రంగుబంతులను ఉపయోగిస్తున్నారు.

అదే...ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ , ఇన్ స్టంట్ వన్డే క్రికెట్లో మాత్రం....తెలుపు రంగు బాల్స్ ను మాత్రమే వాడుతూ వస్తున్నారు. క్రికెట్ బాల్స్ లో సైతం రకరకాల బ్రాండ్ల బాల్స్ ఉన్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, భారత్ దేశాల వాతావరణం, పరిస్థితులకు అనుగుణంగా...ఆయా దేశాలలోని క్రీడాపరికరాల సంస్థలు... ఐసీసీ నిర్ధేశిత ప్రమాణాల మేరకు బంతులను తయారు చేస్తూ వస్తున్నాయి. ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్ తో పాటు...కంగారూ గడ్డపై జరిగే టెస్ట్ మ్యాచ్ లు, వన్డే సిరీస్ లు, డే- నైట్ టెస్టుల్లో...మేడిన్ ఆస్ట్రేలియా క్రికెట్ బ్రాండ్...కుకాబురా బాల్స్ ను విస్త్రుతంగా వాడుతున్నారు.

అంతేకాదు...ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో జరిగే వన్డే, టీ-20 ఫార్మాట్లను కుకాబురా బ్రాండ్ బాల్స్ తోనే నిర్వహిస్తున్నారు. ఇదే...ఇంగ్లండ్ లో జరిగే టెస్టుమ్యాచ్ ల్లో డ్యూక్ బ్రాండ్ బాల్స్ ను, భారత దేశవాళీ క్రికెట్ తో పాటు...టెస్టుమ్యాచ్ ల్లో.... SG కమ్ సాన్స్ పెరిల్స్ గ్రీన్ ల్యాండ్స్ బ్రాండ్ బాల్స్ ను వినియోగిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరిగే టెస్టుల్లో...డ్యూక్ బ్రాండ్ బాల్స్ ను వాడితేనే బాగుంటుందని...విరాట్ కొహ్లీ గట్టిగా చెబుతున్నాడు.నాణ్యత లోపించిన SG బ్రాండ్ బాల్స్ ను తరచూ మార్చడం వల్ల...ఆటలో విలువైన సమయం వృథాకావడమే కాదు..ఆటగాళ్ల ఏకాగ్రత సైతం దెబ్బ తింటోందంటూ కొహ్లీ అసహనం వ్యక్తం చేశాడు.

మరోవైపు...మొదటి ఐదు లేదా ఆరు ఓవర్ల ఆటకే SG బాల్స్ ఆకారం మారిపోతోందని....బంతి పాతబడినా...కాస్త మెత్తబడినా...బౌలర్లకూ ఏవిధంగానూ ఉపయోగపడదంటూ...పేసర్ కుల్దీప్ యాదవ్, స్పిన్నర్లు అశ్విన్, కుల్దీప్ యాదవ్ వాపోతున్నారు. అదే...డ్యూక్ బ్రాండ్ బాల్స్ ను వాడితే...ఆట 90 ఓవర్ల వరకూ బంతి నాణ్యత ఒకేలా ఉంటుందని...బౌలర్లకు బంతి ఏదోవిధంగా అనువుగా ఉంటుందని చెబుతున్నారు.రాజ్ కోట వేదికగా వెస్టిండీస్ తో ముగిసిన తొలిటెస్టులో ఆరు వికెట్లు పడగొట్టిన కుల్దీప్ యాదవ్, హైదరాబాద్ టెస్టులో 10 వికెట్లు తీసిన ఉమేశ్ యాదవ్...ఇద్దరూ SG బ్రాండ్ బాల్ తోనే రాణించిన వాస్తవాన్ని మరచిపోయి... నాణ్యతలేదంటూ విమర్శించడం...వారి అవివేకానికి నిదర్శనమని అజర్ చెప్పాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories