చారిత్రాత్మక రికార్డ్ కు అడుగు దూరంలో ఆస్ట్రేలియా

nanireddy
Updated on: 24 Dec 2018 4:41 PM IST
చారిత్రాత్మక రికార్డ్ కు అడుగు దూరంలో ఆస్ట్రేలియా
X

క్రికెట్ ఆస్ట్రేలియా త్వరలో చారిత్రాత్మక రికార్డ్ క్రియేట్ చేయబోతోంది. ఇప్పటివరకు అని ఫార్మాట్లు కలిపి 999 విజయాలు సాధించిన ఆసీస్ వెయ్యో విజయానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది. మంగళవారం భారత్ తో ముగిసిన టెస్టులో గెలుపొంది మొత్తం 999 విజయాలు సాధించింది. ఇందులో 557 వన్డేలు, 58 టీ20ల్లో విజయం సాధించింది. అలాగే 816 టెస్టులు ఆడి 384 మ్యాచుల్లో విజయం సాధించింది. ఫలితంగా ఆసీస్ అన్ని ఫార్మాట్లలో కలిపి 999 విజయాలు సాధించి.. మరో విజయం కోసం పరితపిస్తోంది. ఆ ఒక్క విజయం సాధిస్తే ఇప్పటివరకు ఏ జట్టు సాధించంచని అసాధారణ రికార్డును ఆసీస్ సాధించినట్టవుతుంది. మరోవైపు ఈ ఒక్క విజయం కోసం ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియా 146 పరుగుల తేడాతో భారత్‌పై భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.

nanireddy

nanireddy

Next Story