ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను హత్య చేసిన మావోయిస్టులు వీరే..

nanireddy
Updated on: 24 Dec 2018 3:03 PM IST
ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను హత్య చేసిన మావోయిస్టులు వీరే..
X

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన అరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్య విషయంలో పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు.ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ లను హత్య చేసిన మావోయిస్టులను పోలీసులు గుర్తించారు. ప్రత్యక్ష సాక్ష్యుల కథనాలతో.. ముగ్గురు నేరుగా దాడిలో పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. వారి ఫోటోలు విడుదల చేశారు. ప్రజా ప్రతినిధులను హత్య చేసింది శ్రీనుబాబు, స్వరూప, అరుణ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కాగా ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి ప్రభుత్వ లాంచనాలతో ఇద్దరి అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియల ఏర్పాట్లను మంత్రులు, ఎమ్మెల్యేలు దగ్గరుండి పర్యవేక్షించారు.

nanireddy

nanireddy

Next Story