Top
logo

మహిళపై కన్నేసి భారీ ప్లాన్ వేశాడు.. చివరకు చూస్తే!

మహిళపై కన్నేసి భారీ ప్లాన్ వేశాడు.. చివరకు చూస్తే!
X
Highlights

వివాహితపై కన్నేసిన ఓ వ్యక్తి భారీ ప్లాన్ వేశాడు.. ఈ క్రమంలో భార్యపై భర్తకు అనుమానాన్ని క్రియేట్ చేశాడు....

వివాహితపై కన్నేసిన ఓ వ్యక్తి భారీ ప్లాన్ వేశాడు.. ఈ క్రమంలో భార్యపై భర్తకు అనుమానాన్ని క్రియేట్ చేశాడు. భర్తను అడ్డు తొలగించేందుకు కుట్ర చేశాడు.. ఇంతాచేసి చివరకు అడ్డంగా బుక్కయ్యాడు.. హైదరాబాద్ శ్రీకృష్ణానగర్ కాలనీలో బాధిత కుటుంబం నివాసముంటోంది. బాధిత వ్యక్తి మెట్లుదిగుతూ కాలు జారీ పడటంతో అంబులెన్సు కు ఫోన్ చేసింది భార్య .. అంబులెన్సు తోపాటు అక్కడికి చేరుకున్నాడు మాల్యాద్రి అనే వ్యక్తి. అతనికి చికిత్స చేసిన అనంతరం రోజు ఫిజీయోథెరఫీ చేయించుకోవాలని డాక్టర్లు సూచించారు. ఆ పని నేను చేస్తానంటూ మాల్యాద్రి రోజు ఇంటికి వచ్చి అతనికి ఫిజీయోథెరఫీ చేసేవాడు. ఈ క్రమంలో పేషేంట్ భార్యపై కన్నేశాడు మాల్యాద్రి. కొద్ది రోజుల తరువాత మీ భార్యకు ఆసుపత్రిలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి వివరాలు సేకరించాడు.. అంతేకాకుండా భార్య భర్తల ఫోన్లు తీసుకుని ఓ యాప్ క్రియేట్ చేసి వారు రోజు ఏమి మాట్లాడుకుంటున్నారు. సదరు మహిళ ఎక్కడికెక్కడికి వెళుతోంది అనే వివరాలు వారి ఫోన్ నుంచే తస్కరించాడు. ఆ తరువాత ఎవరో అజ్ఞాతవ్యక్తి రాసినట్టు లెటర్ రాసి భార్యభర్తల మధ్య చిచ్చుపెట్టాలని ప్రయత్నం చేశాడు. పైగా ఏమి తెలియనట్టు ఆ తతంగాన్ని నేను చూసుకుంటాను అని చెప్పేవాడు.. ఇక రోజు రోజుకు సదరు మహిళపై భర్తకు అనుమానం కలిగేలా లెటర్లు రాసి చివరకు ఆమెను భయబ్రాంతులకు గురిచేశాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్ళింది. ఇదే అదనుగా భావించిన మాల్యాద్రి..ఆమె భర్తను హత్య చేసి ఆమెను శాశ్వతంగా తన వద్దే ఉంచుకోవాలని పథకం వేశాడు. ఇందులో భాగంగా పది రోజుల ముందే ఆమె భర్తకు స్లో పాయిజన్‌ ఇచ్చాడు. ఒకవేళ హత్యాప్లాన్ వికటిస్తే అతడిని మంచానికే పరిమితం చేయొచ్చు తద్వారా ఆమె తనకే సొంతం అవుతుందనే కుట్ర చేశాడు.. ఇదిలావుంటే తమ మధ్య ఎవరో కుట్ర చేస్తున్నారు భర్తకు అర్ధమైంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారి గోడును వినీ దీనికి అంతటికి కారణం మాల్యాద్రిగా తేల్చారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Next Story