వైసీపీలో చేరిన మరో నేత!
గతకొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ వలసలు ఊపందుకున్నాయి. అధికార తెలుగుదేశం పార్టీ ఓవర్లోడ్ కావడంతో నేతలు ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. ఇప్పటికే ప్రతిపక్ష వైసీపీ వలసలను ప్రోత్సహిస్తోంది. వెల్లంపల్లి శ్రీనివాస్ తో మొదలైన వలసల పర్వం టీడీపీ నేత వసంత నాగేశ్వర రావు కుమారుడు కృష్ణ ప్రసాద్ తో ఆగిపోయింది. అయితే అడపా దడపా నేతలు చేరుతూనేవున్నారు. తాజాగా పాలకొల్లు మాజీ కార్పొరేటర్, ఏపీ నాయీబ్రాహ్మణ ఫెడరేషన్ మాజీ చైర్మన్ గురు శేఖర్‌బాబు వైసీపీలో శనివారం చేరారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో జరుగుతున్న పాదయాత్రలో జగన్ సమక్షంలో పార్టీలో చేరారు.
Next Story




