కృష్ణాజిల్లాలో క్రూరత్వం.. మూడేళ్ల పసిబిడ్డపై..

nanireddy
Updated on: 24 Dec 2018 1:56 PM IST
కృష్ణాజిల్లాలో క్రూరత్వం.. మూడేళ్ల పసిబిడ్డపై..
X

ఎంతకీ ఏడుపు ఆపడం లేదని అభం శుభం తెలియని పసిబిడ్డపై ఓ ఆయా ప్రతాపాన్ని చూపించింది . కృష్ణాజిల్లా పెదపారుపూడి మండలం భూషణగుళ్ల అంగన్ వాడీ కేంద్రంలో మూడేళ్ల చిన్నారి ఆపకుండా ఏడ్చాడు. ఎంతకీ నోరుమూయక పోవడంతో.. ఆయా కుమారికి ఎక్కడలేని కోపం వచ్చింది. దీంతో చిన్నారి నోట్లో కారం పెట్టి.. అరవకుండా నోరు మూసేసింది. ఈ తతంగాన్ని చూసిన స్థానికులు.. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారు అంగన్ వాడీ కేంద్రం ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న అధికారులు.. ఆయా కుమారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో.. వారు ఆందోళన విరమించారు.

nanireddy

nanireddy

Next Story