పరువు హత్య పోస్టర్ల కలకలం

nanireddy
Updated on: 24 Dec 2018 2:59 PM IST
పరువు హత్య పోస్టర్ల కలకలం
X

మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య మరవక ముందే తండ్రి చేతిలో విచక్షణ రహితంగా దాడికి గురైంది హైదరాబాద్ కు చెందిన మాధవి. తీవ్ర గాయాలతో మాధవి కోలుకుంటోంది. ఇదిలావులంటే విజయవాడలో ఆకాతాయిలు పెట్టిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. పరువు హత్యకు గురికానున్న సోని.. రాహు‌.. ప్రియ అని రాసిన పోస్టర్లు వెలిశాయి. విజయవాడ సత్యనారాయణపురం శివాలయం వీధి నిండా ఈ పోస్టర్లు ఉండటంతో అక్కడున్న ప్రజలు ఏమి జరుగుతుందోనని పోలీసులకు ఫిర్యాదు చేశారు.సమాచారమందుకున్న పోలీసులు ఇదంతా ఎవరో ఆకతాయిల పనే అని భావిస్తున్నారు. అమ్మాయిని భయపెట్టేందుకు ఇలా చేసి ఉంటారని భావించి.. సోని రాహు‌ ప్రియ ఎవరు?.. పోస్టర్లు పెట్టింది ఎవరు అనే కోణంలో విచారణ చేపట్టారు.

nanireddy

nanireddy

Next Story